ఆస్ట్రేలియా యొక్క అగ్రశ్రేణి వేగం గల బౌలర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) తన 100వ టెస్ట్ మ్యాచ్‌లో సూపర్ స్పెషల్ ప్రదర్శనతో చరిత్రలో తన పేరును చెక్కించుకున్నాడు. వెస్టిండీస్‌తో (WI vs AUS) కింగ్స్‌టన్ సబీనా పార్క్‌లో జరిగిన ఈ టెస్టు మ్యాచ్‌లో స్టార్క్ ఒక అద్భుతమైన రికార్డు నమోదు చేశాడు. కేవలం 15 బంతుల్లోనే 5 వికెట్లు పడగొట్టి టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ఐదు వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు.

గత రికార్డు బ్రేక్
ఇంతకు ముందు ఈ ఘనత 19 బంతుల్లో ఐదు వికెట్లు తీసిన ఎర్నీ తోషాక్, స్టువర్ట్ బ్రాడ్, స్కాట్ బోలాండ్ పేరిట ఉండగా, ఇప్పుడు స్టార్క్ కొత్త మైలురాయిని అధిగమించాడు. ఇది కేవలం అతని కెరీర్‌కు మాత్రమే కాకుండా, ప్రపంచ క్రికెట్ చరిత్రకే ఒక మైలు రాయిగా మారింది.
విండీస్ బ్యాటింగ్ ధ్వంసం
వెస్టిండీస్ (WI vs AUS) జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 204 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించగా, ఆ జట్టు కేవలం 27 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది టెస్ట్ క్రికెట్‌లో వారి అత్యల్ప స్కోర్లలో ఒకటి. స్టార్క్ మొత్తం 6 వికెట్లు తీయగా, స్కాట్ బోలాండ్ హ్యాట్రిక్ సాధించడం విశేషం. ఆసీస్ బౌలర్ల ధాటికి విండీస్ ఇన్నింగ్స్ లో ఏడుగురు బ్యాట్స్ మెన్ డకౌట్ అయ్యారు. జస్టిన్ గ్రీవ్స్ చేసిన 11 పరుగులే ఆ జట్టులో అత్యధిక స్కోరు.
400 వికెట్ల క్లబ్‌లోకి ప్రవేశించిన స్టార్క్
ఈ మ్యాచ్‌లోని ఆ వికెట్లతో కలిసి మిచెల్ స్టార్క్ తన టెస్టు కెరీర్‌లో 400 వికెట్లు పూర్తిచేశాడు. ఈ ఘనత సాధించిన నాలుగో ఆసీస్ బౌలర్ గా నిలిచాడు .
Read hindi news: hindi.vaartha.com
Read also: IND vs ENG: రవీంద్ర జడేజా తప్పు చేసాడన్న సునీల్ గవాస్కర్