బాలీవుడ్ ప్రముఖులు కపిల్ శర్మ, రాజ్‌పాల్ యాదవ్, కొరియోగ్రాఫర్ రెమో డిసౌజా, సింగర్ సుగంధ మిశ్రాలకు పాకిస్థాన్ నుండి తక్షణమే స్పందించాల్సిందిగా బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఈ విషయం పై ముంబైలోని అంబోలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బెదిరింపులు పంపిన వారి ఐపీ అడ్రస్‌ను ట్రేస్ చేయగా, అవి పాకిస్థాన్ నుంచి వచ్చాయని గుర్తించారు. ఈ విషయంపై మరింత సమాచారం కోసం భారత ప్రభుత్వం పాక్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.నిందితులు సెలబ్రిటీలకు ఈమెయిల్ ద్వారా బెదిరింపులు పంపారు. “ఇటీవల మీ కార్యకలాపాలపై పర్యవేక్షణ చేస్తున్నాం. ఇది సాధారణ హెచ్చరిక కాదు, పబ్లిక్ స్టంట్ కాదు.
ఈ మెసేజ్‌ను తీవ్రంగా తీసుకో.8 గంటల్లో స్పందించకపోతే, వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది” అంటూ హెచ్చరించారు. ఈమెయిల్ చివరన “బిష్ణు” అనే పేరు ఉంది, దీని ఆధారంగా ఇది గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనిగా అనుమానిస్తున్నారు.బెదిరింపుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, కపిల్ శర్మతో పాటు ఇతర సెలబ్రిటీలకు ప్రత్యేక భద్రత కల్పించామని పోలీసులు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో కీలక ఆధారాలు సేకరించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.కపిల్ శర్మ కామెడీ షోల ద్వారా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించాడు. ‘గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ చాలెంజ్’, ‘కామెడీ నైట్స్’ వంటి షోలతో ఆయన పేరు ప్రఖ్యాతలు పొందాడు.
పలు సినిమాల్లోనూ నటించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇక రాజ్‌పాల్ యాదవ్ కూడా కామెడీ పాత్రలతో సినీ ప్రియుల గుండెల్లో చోటు సంపాదించుకున్నాడు.ఈమెయిల్‌లో నిందితులు తమ బెదిరింపులను పబ్లిసిటీ స్టంట్ కాదు అంటూ స్పష్టం చేశారు. అయితే, ఈ బెదిరింపుల వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా? లేదా ఎవరైనా గ్యాంగ్‌స్టర్ లీడర్ దీనికి మూలమా అన్నది దర్యాప్తులో తేలనుంది. ఇలాంటి పరిణామాలు బాలీవుడ్‌కు ఆందోళన కలిగించే అంశమనే చెప్పాలి. సెలబ్రిటీల భద్రతకు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు.