Etela Rajender : మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్‌పై ప్రాంతీయ పార్టీల వలే కాంగ్రెస్ దిగజారి మాట్లాడుతోందని ఈటల మండిపడ్డారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్‌పై కేంద్రం ఎక్కడ అధికారిక ప్రకటన చేయలేదని, అందుకు ఎలాంటి విధివిధానాలను కూడా ఖరారు చేయలేదన్నారు. అఖిలపక్ష భేటీతో విపక్షాలు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు.

ఎవరూ అలాంటి అపోహాలు పెట్టుకోవద్దు
డీలిమిటేషన్‌తో తెలంగాణలో ఎంపీ సీట్లు తగ్గుతాయని జరగుతోన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. సీట్లు పెరిగే అవకాశం ఉండొచ్చు కానీ, తగ్గే ప్రసక్తే లేదని క్లారిటీ ఇచ్చారు. ఎవరూ అలాంటి అపోహాలు పెట్టుకోవద్దని విపక్షాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గాల పునర్విభజనకు ప్రాతిపాదిక ఏంటనే విషయం ఇంకా తేలాల్సి ఉందన్నారు.
పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
కాగా, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందన్న విషయమై చర్చించేందుకు డీఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం శనివారం ప్రారంభమైంది. సీఎం స్టాలిన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి , పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు.