తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగర విస్తరణపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే ఫ్యూచర్ సిటీ పేరుతో హైదరాబాద్ దక్షిణ భాగంలో కొత్త నగరాన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. దీనిలో భాగంగా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ FCDA పరిధిలో మొత్తం 765.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 56 రెవెన్యూ గ్రామాలను చేర్చారు. ఈ గ్రామాల వివరాలను ప్రభుత్వం గెజిట్ ద్వారా ప్రకటించింది. హైదరాబాద్ మునిసిపల్ విస్తీర్ణాన్ని పెంచుతూ, భవిష్యత్ నగర రూపకల్పనలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం, ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడనుంది.

FCDA – పాలన & కమిటీ సభ్యులు
ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్‌కు మరింత స్పష్టత, వేగం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో FCDA – పాలన & కమిటీ సభ్యులు
FCDA ఛైర్మన్: సీఎం రేవంత్ రెడ్డి
వైస్ ఛైర్మన్: మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్, పరిశ్రమలు, ఐటీ & వాణిజ్య శాఖ మంత్రులు
కమిటీ సభ్యులు: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) , ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ , పరిశ్రమలు, ఐటీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ,మున్సిపల్ శాఖ కార్యదర్శి ,పర్యావరణ & అటవీ శాఖ కార్యదర్శి ,TSIIC మేనేజింగ్ డైరెక్టర్ , రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ,హెచ్‌ఎండీఏ కమిషనర్ ,హైదరాబాద్ DTCP సభ్యులు , FCDA కమిషనర్ మెంబర్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్‌ను మెట్రోపాలిటన్ నగరంగా మరింత అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటోంది. ఫోర్త్ సిటీ పేరుతో కొత్త నగర నిర్మాణం హైదరాబాద్ సౌత్‌లో 30,000 ఎకరాల్లో అభివృద్ధి భవిష్యత్తులో మెట్రో, రోడ్డు, రైల్వే కనెక్టివిటీ కల్పించే ప్రణాళిక ఐటీ, వాణిజ్య, పరిశ్రమల అభివృద్ధికి అవకాశం వృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ మార్కెట్.
FCDA పరిధిలోకి వచ్చిన 56 రెవెన్యూ గ్రామాలు
కందుకూరు మండలం: దాసర్లపల్లి, అన్నోజిగూడ, దెబ్బడగూడ, గూడూర్, గుమ్మడవల్లె, కందుకూరు, కొత్తూర్, గఫూర్‌నగర్, లేమూర్, మాదాపూర్, మీర్‌ఖాన్‌పేట, మొహమ్మద్ నగర్, ముచ్చర్ల, పంజాగూడ, రాచలూర్, సర్వరావులపల్లె, తిమ్మాయిపల్లె, తిమ్మాపూర్
ఇబ్రహీంపట్నం మండలం: కప్పపహాడ్, పోచారం, రామ్‌రెడ్డిగూడ, తులేకలాన్, తుర్కగూడ, ఎలిమినేడు, ఎర్రకుంట, తడ్లకల్వ
యాచారం మండలం: చౌదరిపల్లి, గున్‌గల్, కొత్తపల్లి, కుర్మిద్ద, మేడిపల్లి, మల్కాజిగూడ, మొగుళ్లవంపు, నక్కర్త, నానక్‌నగర్, నంది వనపర్తి, నజ్దిక్ సింగారం, తక్కెళ్లపల్లి, తాటిపర్తి, తులేఖుర్ద్, యాచారం, చింతపట్ల, నల్లవెల్లి
కడ్తాల్ మండలం: చెర్లికొండపట్టి కల్వకుర్తి, చెర్లికొండపట్టి పడ్కల్, ఏక్‌రాజ్‌గూడ, కడ్తాల్, కర్కాల్ పహాడ్, ముద్విన్
ఆమన్‌గల్ మండలం: కోనాపూర్, రామనూతుల
మహేశ్వరం మండలం: మొహబ్బత్‌నగర్, తుమ్మలూర్
మంచాల మండలం: ఆగపల్లి, నోముల, మల్లికార్జునగూడ ,ప్రస్తుతం గ్రామాలుగా ఉన్న ఈ ప్రాంతాలు పట్టణాలుగా మారనున్నాయి.
రియల్ ఎస్టేట్ ధరలకు రెక్కలు – ప్రస్తుతం ఎకరం రూ. కోటి వరకు ఉన్న భూముల ధరలు మరింత పెరిగే అవకాశం. పరిశ్రమలు, ఐటీ అభివృద్ధి – కొత్త పరిశ్రమలు ఏర్పాటవ్వడంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.
సమగ్ర ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ – మెట్రో, రోడ్లు, రైల్వే కనెక్టివిటీ పెంచేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మరింత అభివృద్ధి చెందనుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం, భవిష్యత్ తరాలకు మెరుగైన జీవన ప్రమాణాలను అందించేందుకు దోహదం చేయనుంది.