దేశంలో ద్విచక్ర వాహన ప్రమాదాల్లో (Two-wheeler accidents) మరణాలు అధికంగా నమోదవుతున్నాయి. దీనికి ముఖ్యమైన కారణం హెల్మెట్ (Helmet) ధరించకపోవడమేనని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రైడర్‌తో పాటు పిలియన్ రైడర్ భద్రత కూడా ఎంతో ముఖ్యం అనే దృష్టితో కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
జనవరి 1, 2026 నుంచి రెండు హెల్మెట్లు తప్పనిసరి
వచ్చే ఏడాది జనవరి 1, 2026 నుంచి దేశంలో విక్రయించబోయే అన్ని కొత్త ద్విచక్ర వాహనాలపై రెండు BIS (Bureau of Indian Standards) సర్టిఫైడ్ హెల్మెట్లు ఉచితంగా అందించాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం కంపెనీలు కేవలం ఒక్క హెల్మెట్‌ను మాత్రమే ఉచితంగా ఇస్తున్నాయి. కానీ త్వరలో ఈ నిబంధన మారనుంది. ఈ నిర్ణయం వల్ల రైడర్‌తో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాల్సిన అవసరం తలెత్తుతుంది.
భద్రత పెరిగే అవకాశం – వాహనదారులకు అవగాహన అవసరం
ఈ నిర్ణయం ద్విచక్ర వాహనదారుల భద్రతను మరింతగా పెంచనుంది. తరచూ వెనుక కూర్చున్న వ్యక్తులు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాలప్పుడు తీవ్ర గాయాలు, మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. అయితే ఇది కేవలం నిబంధనల కింద మాత్రమే కాకుండా, ప్రజలలో స్వచ్ఛందంగా భద్రతపై అవగాహన కలగడం ద్వారా ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also : President Droupadi Murmu : కన్నీళ్లు పెట్టుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము