2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ లో టీమ్ ఇండియా తన ప్రచారాన్ని ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో ప్రారంభించనుంది. రోహిత్ శర్మ నేతృత్వంలో ఆడనున్న భారత జట్టులో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నారు. ఈ టోర్నమెంట్ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరుగుతుంది. భారత జట్టు పాకిస్థాన్, న్యూజిలాండ్‌తో కీలకమైన మ్యాచ్‌లు కూడా ఆడనుంది.

పాకిస్థాన్‌తో మ్యాచ్ ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా జరగనుంది, అలాగే న్యూజిలాండ్‌తో మ్యాచ్ మార్చి 2న నిర్వహించబడుతుంది.ఈ టోర్నమెంట్‌లో భారత్ అద్భుతంగా ఆడితే సెమీ-ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లో జరుగుతాయి.ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్లేయింగ్ ఎలెవన్ గురించి చెప్పాలంటే, రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయనున్నాడు, అలాగే శుభ్‌మన్ గిల్ కూడా అతనితో కలిసి ఈ రోల్ పోషించనున్నాడు. వీరు తమ దూకుడు బ్యాటింగ్‌తో టీమ్ ఇండియాకు అద్భుతమైన ప్రారంభాన్ని అందించగలరు.
అయితే, యశస్వి జైస్వాల్ ఈ సారి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండే అవకాశం లేదు.మూడో స్థానంలో మాత్రం స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయనున్నాడు. విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే, అతను ఒకసారి సెట్ అయిన తర్వాత, ఏ జట్టు బౌలింగ్ అటాక్ అయినా నాశనం చేయగలడు. ఇప్పటివరకు కోహ్లీ 295 వన్డే మ్యాచ్‌లలో 283 ఇన్నింగ్స్‌లలో 58.18 సగటుతో 13,906 పరుగులు సాధించాడు. ఈ సమయంలో అతను 50 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు సాధించాడు. అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో విరాట్ కోహ్లీ 183 పరుగుల అత్యుత్తమ స్కోరు సాధించాడు.ఈ టోర్నమెంట్‌లో భారత్ ఎంత వరకు పోటీ పడుతుందో, ఎలాంటి ప్రదర్శన చూపిస్తుందో చూడాలి.