हिन्दी | Epaper
విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు

WheatGrassJuice: ఈ జ్యూస్ తాగితే ఆరోగ్యం మీ చెంతే

Sharanya
WheatGrassJuice: ఈ జ్యూస్ తాగితే ఆరోగ్యం మీ చెంతే

మనకు అనేక రకాల పండ్ల జ్యూస్ లు లభిస్తాయి, కానీ గోధుమ గడ్డి జ్యూస్ లో ఉన్న పోషకాలు, విటమిన్లు ఇతర ఏ పండ్ల జ్యూస్ లోనూ అంతగా ఉండవు. ఇది శరీరానికి అత్యంత మేలు చేసే ఒక ప్రకృతిసిద్ధమైన ఆరోగ్య పానీయం. గోధుమ గడ్డి జ్యూస్ ను రోజు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. గోధుమ గడ్డి జ్యూస్ విటమిన్ A, C, E, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా అందించడమే కాకుండా, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి.

గోధుమ గడ్డి జ్యూస్ ఆరోగ్య ప్రయోజనాలు

1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది

గోధుమ గడ్డి జ్యూస్ లో ఉన్న విటమిన్ C మరియు ఫైటోన్యూట్రియంట్స్ శరీరంలో వ్యాధులపై పోరాడే శక్తిని పెంచుతాయి. తరచుగా జలుబు, దగ్గు వచ్చే వారికి ఇది అద్భుతమైన పరిష్కారం.

2. చర్మం కోసం వరం

గోధుమ గడ్డి జ్యూస్ చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా ఉంచుతుంది. మొటిమలు, ముడతలు, పొడిబారిన చర్మ సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

3. జీర్ణ వ్యవస్థకు మేలు

ఈ జ్యూస్ జీర్ణాశయానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది జీర్ణ ఎంజైమ్ ఉత్పత్తిని మెరుగుపరిచే గుణాన్ని కలిగి ఉంటుంది. గ్యాస్, అజీర్ణం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.

4. బరువు తగ్గడానికి సహాయపడుతుంది

బరువు తగ్గాలనుకునే వారు గోధుమ గడ్డి జ్యూస్ ను తమ డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిది. ఇది భోజనానికి ముందు తాగితే ఆకలి నియంత్రణ చేయడంలో సహాయపడుతుంది.

5. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

గోధుమ గడ్డి జ్యూస్ గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుతుంది.

6. షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది

మధుమేహం ఉన్నవారు గోధుమ గడ్డి జ్యూస్ ను తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ క్రమబద్ధంగా నియంత్రితమవుతాయి. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.

7. డిటాక్సిఫికేషన్ లో సహాయపడుతుంది

గోధుమ గడ్డి శరీరాన్ని పూర్తిగా శుభ్రపరచే ఒక నేచురల్ డిటాక్సిఫైయర్. శరీరంలోని హానికరమైన టాక్సిన్లను తొలగించడానికి ఇది సహాయపడుతుంది.

8. నెలసరి సమస్యలకు ఉపశమనం

గోధుమ గడ్డి జ్యూస్ లోని పోషకాలు హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. అధిక రుతుస్రావం సమస్య ఉన్న మహిళలకు ఇది చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది.

గోధుమ గడ్డిని ఇంట్లోనే పెంచుకోండిలా?

గోధుమ గడ్డిని ఇంట్లోనే పెంచుకోవడం చాలా సులభం. చిన్న చిన్న మట్టి పాత్రలు లేదా ప్లాస్టిక్ డబ్బాలలో గోధుమ గింజలను నాటండి. మట్టి తడిసేంతవరకు రోజూ నీళ్లు పోయాలి. సూర్యరశ్మి తగినంతగా అందేలా చూడాలి. 15-20 రోజుల్లో పచ్చని గోధుమ గడ్డి పెరిగి జ్యూస్ తయారుచేయడానికి సిద్ధమవుతుంది. 15-20 రోజులకు గడ్డి గడ్డిని కత్తిరించి చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మిక్సీ గిన్నెలో వేసి కొద్దిగా నీరు కలిపి బ్లెండ్ చేయాలి. నారించి గుజ్జును తొలగించి తాగాలి. రోజు గోధుమ గడ్డి జ్యూస్ తీసుకోవడం వల్ల ఇంకా మరిన్ని ప్రయోజనాలు ఉంటాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870