ఈ మధ్య హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ (drunk and drive) కేసులు తెగ నమోదు అవుతున్నాయి. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నా కొందరు మాట వినడం లేదు. లైసెన్సులు (license) రద్దు చేసినా దారిలోకి రావడం లేదు. దీంతో ఇంకాస్త కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది.

సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ డ్రైవర్లకు చెక్ పెట్టేందుకు ప్రతి వారాంతంతో ఉధృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి దొరికితే కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు కోర్టుల్లో ఫైన్లు వేయిస్తున్నారు. అదే పనిగా తాగి దొరికేవారిని జైలుకు కూడా పంపుతున్నారు. కొందరు జడ్జిలు వారిని సామాజిక కార్యక్రమాల్లో భాగం అవ్వాలని వినూత్న శిక్షలు వేస్తున్నారు. తాజాగా సైబరాబాద్ పోలీసులు చేసిన వారంతపు డ్రైవ్‌లో 272 మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. మద్యం సేవించి ద్విచక్ర వాహనాలు నడుపుతూ 189 మంది, త్రిచక్ర వాహన డ్రైవర్లు 12 మంది… 66 మంది నాలుగు చక్రాల వాహన డ్రైవర్లు, ఐదుగురు భారీ వాహన ఆపరేటర్లు పోలీసులకు చిక్కారు.
అత్యధిక కేసులు
మియాపూర్‌లో అత్యధికంగా 50 కేసులు నమోదయ్యాయి. శంషాబాద్‌లో రెండవ స్థానంలో ఉంది. అక్క 43 మంది తాగి నడుపుతూ పోలీసులకు చిక్కారు. షాద్‌నగర్, చేవెళ్లలో 32 కేసులు చొప్పున నమోదయ్యాయి. మరోవైపు రాయదుర్గం, కూకట్‌పల్లి, కేపీహెచ్, ఆర్‌సీ పురంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మాదాపూర్‌లో మద్యం తాగి వాహనం నడుపుతూ ఒక్కరు పట్టుబడ్డారు.
వీరిలో 245 మంది డ్రైవర్ల రక్తంలో ఆల్కహాల్ సాంద్రతలు (BAC) 35mg/100ml నుంచి 200mg/100ml మధ్య ఉన్నాయి.
Read Also : Suicide: మానసిక కుంగుబాటుతో రాలిన యువ సాఫ్ట్‌వేర్