What is the benefit of this zero tax for the unemployed? : Shashi Tharoor

నిరుద్యోగులకు ఈ జీరో పన్నుతో కలిగే ప్రయోజనం ఏమిటి? : శశిథరూర్‌

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎంపీ శశిథరూర్‌ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన 75 నిమిషాల బడ్జెట్‌ ప్రసంగంలో ఎక్కడా నిరుద్యోగం, ద్రవ్యోల్బం ఊసు ఎత్తలేదెందుకు..? అని ఆయన క్వశ్చన్‌ చేశారు. మధ్య తరగతికి ప్రయోజనం చేకూరేలా పన్ను శ్లాబుల్లో మార్పులు చేయడాన్ని మెచ్చుకుంటూనే.. మరి నిరుద్యోగులకు ఈ జీరో పన్నుతో కలిగే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.

image

మీకు ఉద్యోగం ఉండి, ఏడాదికి రూ.12 లక్షల కంటే తక్కువ వేతనం ఉంటే.. సంతోషించదగ్గ విషయమే. మరి నిరుద్యోగుల సంగతేంటి..? అని నొక్కినొక్కి ప్రశ్నించారు. ఈ బడ్జెట్‌లో మధ్యతరగతి ప్రజలపై పన్నులు తగ్గించడాన్ని బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. బడ్జెట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొత్త పన్ను పాలసీతో మధ్యతరగతి ప్రజలకు మేలు చేయడం మంచి విషయమే. మరి కరెక్టుగా ఆలోచిస్తే.. మీకు వేతనం వస్తున్నట్లయితే మీరు మీరు చెల్లించే గతంలో కంటే తగ్గుతుంది. కానీ నా ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే.. మరి మీకు ఉద్యోగమే లేకపోతే తగ్గిన పన్నుతో ఏం లాభం..? అని ప్రశ్నించారు.

కేంద్ర బడ్జెట్‌ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టు లేదని, ఎన్నికల్లో పొందే ఓట్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్‌ అని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు, బీజేపీ మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ కేటాయింపులు చేశారని విమర్శించారు. ప్రధాన సమస్యలైన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అంశాలను ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో ఎందుకు ప్రస్తావించలేదు. ఆమె పూర్తి ప్రసంగంలో ఎక్కడా ఆ రెండు పదాలు కనిపించకపోవడం విచారకరమని శశిథరూర్‌
అన్నారు.

Related Posts
క్రంచీరోల్..రాబోయే సీజన్ సోలో లెవెలింగ్ కోసం రానా దగ్గుబాటి వాయిస్
Rana Daggubati voices Barca

రానా దగ్గుబాటి సోలో లెవలింగ్ లో బార్కా పాత్రకు మూడు భాషల్లో తన వాయిస్ అందిచాడు. దీంతో మూడు భాషల అభిమానులు రానా వాయిస్ ని డిసెంబర్ Read more

ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ కొత్త వ్యాపారం..
ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ కొత్త వ్యాపారం..

ఇటీవలి కాలంలో భారతదేశంలోని అనేక కంపెనీలు గ్రీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో కొత్త పెట్టుబడులు పెడుతున్నాయి. భవిష్యత్తులో ఈ రంగాల్లోని కంపెనీలకు మంచి భవిష్యత్తు ఉండటంతో Read more

బడ్జెట్ 2025: ఆదాయపు పన్ను మినహాయింపు ఎప్పుడు?
బడ్జెట్ 2025: ఆదాయపు పన్ను మినహాయింపు ఎప్పుడు?

గత కేంద్ర బడ్జెట్‌లో పాత పన్ను విధానంలో మార్పులు చేయకుండా, కొత్త పన్ను విధానంలో కొన్ని ఆకర్షణీయమైన మార్పులను ప్రవేశపెట్టింది. ఆదాయపు పన్ను మినహాయింపులు పొందడానికి జీతాలు Read more

లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు మృతి

మహారాష్ట్రలోని నాసిక్-గుజరాత్ హైవేపై ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లగ్జరీ బస్సు అదుపు తప్పి 200 అడుగుల లోతులోని లోయలో పడిపోయింది. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *