हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Pawan Kalyan : పవన్ కు తమిళనాడుతో సంబంధం ఏంటి?- మంత్రి పీకే శేఖర్ బాబు

Sudheer
Pawan Kalyan : పవన్ కు తమిళనాడుతో సంబంధం ఏంటి?- మంత్రి పీకే శేఖర్ బాబు

తమిళనాడు మంత్రి పీకే శేఖర్ బాబు (PK Sekhar Babu) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan)పై కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో నిర్వహించిన ‘మురుగన్ మహాభక్త సమ్మేళనం’ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ హాజరుకావడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “పవన్ కళ్యాణ్ ఎవరు? ఆయనకు తమిళనాడుతో సంబంధం ఏంటి? ఇక్కడ రాజకీయ వ్యాఖ్యలు చేయడమేంటీ?” అంటూ ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఇతర రాష్ట్రాల నాయకులు తమిళనాడులోకి ప్రవేశించటం సరైన పని కాదని ఆయన వ్యాఖ్యానించారు.

బీజేపీ ధోరణిపై మండిపాటు

ఈ సందర్భంగా మంత్రి శేఖర్ బాబు బీజేపీపై కూడా విమర్శలు గుప్పించారు. మతం, భాష పేరుతో సమాజాన్ని విభజించడమే బీజేపీ లక్ష్యమని ఆరోపించారు. తమిళ సంస్కృతిని, సమాజంలోని ఐక్యతను ధ్వంసం చేయాలనే కుట్రతోనే ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమిలో భాగమైన జ‌న‌సేన పార్టీకి చెందిన నాయకుడిగా వచ్చి ఇక్కడ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడడం అసహ్యం అని ఆయన అభిప్రాయపడ్డారు.

పవన్‌కు సవాలు విసిరిన మంత్రి

“పవన్ కళ్యాణ్‌కు ఇక్కడ మాట్లాడే హక్కు కావాలంటే, చెన్నైలో ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాలి. గెలిచిన తర్వాత ఆయన మాట్లాడితే వింటాం. లేనిపక్షంలో ఆయన వ్యాఖ్యలకు తమిళ్ నాడు ప్రజలు విలువ ఇవ్వరు,” అని స్పష్టం చేశారు మంత్రి శేఖర్ బాబు. రాజకీయ నేతలు ఇతర రాష్ట్రాల్లోని సంప్రదాయాలతో ఆడుకునే ప్రయత్నం చేయకూడదని, ఇది ప్రజల మనోభావాలను గాయపరచే చర్యగా పరిగణించబడుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలు దక్షిణాది రాష్ట్రాల మధ్య రాజకీయ సంబంధాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Read Also : Jagan Sattenapalli Tour : జగన్ పర్యటన వల్ల మరొకరు మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870