నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదా?
బీసీ ఓబిసి లీగల్లీ కన్వర్టెడ్ బీసీ వార్తల్లో ఉన్న మాటలు ఇవి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదని ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈ కామెంట్లపై ఇప్పుడు దుమారం చెలరేగుతోంది. మరి మోదీ బీసీ నా కాదా లేక రేవంత్ రెడ్డి అన్నట్టు లీగల్లీ కన్వర్టెడ్ బీసీ నా అసలు విషయం ఏంటి? రేవంత్ రెడ్డి ఏమన్నారంటే ఓ సభలో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే:“నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదు, ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. పుట్టుకతో మోదీది ఉన్నత కులమే కానీ 2001లో ఆయన సీఎం అయ్యాక తన కులాన్ని బీసీ లో కలుపుకున్నారు. పైగా సర్టిఫికెట్ లో మోదీ బీసీ కానీ ఆయన మనసంతా బీసీ వ్యతిరేకమే.”
బీజేపీ నేతలు కౌంటర్
ఈ కామెంట్లు రాగానే బీజేపీ నేతలు కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టారు. నరేంద్ర మోదీ కులం పై బహిరంగ చర్చకు కూడా మేము రెడీ అని కిషన్ రెడ్డి అంటున్నారు. నిజానికి మోదీ కులం ప్రస్తుతం ప్రస్తావన రావడం దాని చుట్టూ దుమారం లేవడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఇట్లా చాలా జరిగినది. చాలా పార్టీలు దీని గురించి ప్రస్తావన తీసుకొచ్చాయి.2024 లో మోదీ కులం ప్రస్తావన
2024లో రేవంత్ రెడ్డి రాయపూర్ సభలో మోదీ కులం ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన ఏమన్నారంటే: “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓబిసి కుటుంబంలో పుట్టలేదని, ఆయన పుట్టిన మోద్ గాంచి కులానికి గుజరాత్ లో 2000 సంవత్సరంలోనే ఓబిసి హోదా దక్కింది.” అన్నారు. నరేంద్ర మోదీ జనరల్ కులానికి చెందిన వారని రాహుల్ గాంధీ అన్నమాట. అప్పట్లోనే దీనిపై బీజేపీతో పాటు జాతీయ బీసీ కులాల కమిషన్ కూడా క్లారిటీ ఇచ్చాయి.మోదీ కులం – అసలు విషయం
సరే, ఈ విమర్శలన్నీ పక్కన పెడితే అసలు మోదీ కులం ఏంటి? ఆయన ఎక్కడ పుట్టారు, ఆ కులస్తులు చేసే వృత్తి ఏంటి? ఈ విషయాలను చూస్తే, గుజరాత్ వాద్ నగర్ ప్రాంతంలో 1950 సెప్టెంబర్ 17న నరేంద్ర మోదీ జన్మించారు. ఆయనది మోద్ గాంచి అనే కులం. మోద్ గాంచి అంటే ఈ కులాన్ని 1999లో ఓబిసి జాబితాలో చేర్చింది కేంద్రం. మోదీ పుట్టినప్పుడు ఆయన కులం జనరల్ జాబితాలోనే ఉంది, అంటే ఓ సి కేటగిరీ లోనే ఉంది.మోదీ పుట్టినప్పుడు కులం
ఇంతవరకు కరెక్టే, పేరుకే ఓ సి కేటగిరీలో ఉన్న ఈ కమ్యూనిటీ పెద్ద పెద్దగా సంపద ఉన్న కమ్యూనిటీ కాదు. ఇది తేలి సామాజిక వర్గంలో ఒక ఉపకులం. వీరి ప్రధాన వృత్తి నూనె తీయడం. ఈ తేలి సామాజిక వర్గంలో మోద్ గాంచి తో పాటు మరికొన్ని ఉపకులాలు ఉన్నాయి: తేలి సాహు, తేలి రాతూర్, గాంచి, ఇట్లాంటి సబ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు గుజరాత్ తో పాటు చాలా రాష్ట్రాల్లో ఉన్నారు: బీహార్, ఛత్తీస్గడ్, జార్ఖండ్, మహారాష్ట్ర.మోదీకి బీసీ హోదా 2000లో
తేలి సామాజిక వర్గంలోని ఘాంచి ఉపకులాన్ని 1999 లోనే ఓబిసి జాబితాలో చేర్చారు. మోద్ గాంచి, తేలిసాహు, తేలి రాతూర్ ఉపకులాలను 2000 ఏప్రిల్ 4న ఓబిసి జాబితాలో చేర్చారు. ఈ సామాజిక వర్గాలు వెనుకబడినట్టుగా గుజరాత్ ప్రభుత్వం భావించింది. నిర్ణయం తీసుకుంది దానికి సర్వేలు జరిగాయి. మోద్ గాంచి తో పాటు దాని ఉపకులాలను ఓబిసి 146 కులాల జాబితా 25b లో గుజరాత్ ప్రభుత్వం చేర్చింది.మోదీ కులం 2001 తర్వాత
1994 జూలై 25న గుజరాత్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. మండల్ కమిషన్ గుజరాత్ లో సర్వే నిర్వహించింది. మండల్ జాబితా 91a లో మోద్ గాంచి కులం కూడా ఉంది. 1994 జూలై 25న గుజరాత్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ సమయంలో గుజరాత్ లో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అప్పటి సీఎం గా చెబిల్దాస్ మెహతా ఉన్నారు.1999లో మోదీ కులం ఓబిసీలో
1997 నవంబర్ 15 న జాతీయ బీసీ ఉపకులాల కమిషన్ మోద్గాంచి కులాన్ని ఓబిసి జాబితాలో చేర్చాలి అని ప్రతిపాదిస్తే 1999 అక్టోబర్ 17 న దీన్ని ఓబిసి జాబితాలో చేర్చుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. అప్పటికి నరేంద్ర మోదీ ఏ పదవిలోనూ లేరు. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన రెండేళ్ల తర్వాత ఆయన గుజరాత్ సీఎం అయ్యారు. అంటే 2001లో ఆయన సీఎం అయ్యారు.రాహుల్ గాంధీ, మాయావతి వ్యాఖ్యలు
గత ఏడాది రాహుల్ గాంధీ ప్రధాని కులం పై కామెంట్లు చేసిన తర్వాత దీనిపై కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడారు. ఆ సమయంలో మోదీ ఏ పదవిలో లేరని కనీసం ఆయన ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదని చెప్పారు. ఆ టైం లో గుజరాత్ లో మీ పార్టీనే కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంది అని చెప్పారు. అంటే మోదీ పుట్టుకతో ఓసి. ఆ తర్వాత కాలంలో ఆయన కమ్యూనిటీ ఓబిసి కేటగిరీలో నాటి ప్రభుత్వం చేర్చింది. అప్పటి అధికారంలో ఉన్నది మోదీ కాదు, ఈ నిర్ణయం జరిగిన రెండేళ్ల తర్వాత ఆయన సీఎం అయ్యారు.రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ కులగణన
సరే, అసలు బీసీ అనే మాట ఇక్కడ ఎందుకు వినిపిస్తోంది? ఎందుకు హైలైట్ అవుతుంది? అంటే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కులగణన చేపట్టింది. అందులో బీసీల జనాభా తగ్గింది అనే వివాదం ఒకటి నడుస్తోంది. టిఆర్ఎస్, బిజెపి కూడా కాంగ్రెస్ చేపట్టిన కుల గణనపై విమర్శలు చేస్తూనే ఉన్నాయి. ఈ కాంటెక్స్ట్ లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ కులాన్ని ఉద్దేశించిన వ్యాఖ్యలు చేశారు.బీసీ 42% రిజర్వేషన్లు
తెలంగాణ కులగణన తప్పులు తడకగా ఉందని దాని నుంచి దృష్టి మళ్ళించడానికే రేవంత్ రెడ్డి ఇప్పుడు మోదీ కులం గురించి మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. సరే, రాహుల్, రేవంత్ వీళ్లిద్దరేనా అంటే కాదు. గతంలో చాలా మంది నరేంద్ర మోదీ కులం గురించి ఆరోపణలు చేశారు. 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ తెరపైకి వచ్చాక గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన కులం పై ఆరోపణలు చేసింది.42% రిజర్వేషన్ పాస్ అవ్వాలంటే
తెలంగాణలో కులగణన తర్వాత ఆయన ప్రభుత్వానికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. బీసీలకు విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తోంది. దీనికి సంబంధించిన ఈ మధ్య జరిగిన కులగణన తప్పుల తడక అని ఓ పక్కన విమర్శలు వస్తుంటే మరో పక్కన బీసీలకు 42% రిజర్వేషన్ల చట్టబద్ధత కల్పించడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో వాటిని అమలు చేయడం ఇవి తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద టాస్క్లుగా మారిపోయాయి.ఫైనల్ నిర్ణయం
ఈ బిల్లు పార్లమెంట్ లో పాస్ అవ్వాలంటే ఎన్డిఏ పక్షాల సానుకూలంగా ఉండాలి. ఇక్కడ మరో అడ్డంకి కూడా ఉంది. రిజర్వేషన్లు 50% మించకూడదని సుప్రీం కోర్టు తీర్పు చెప్తోంది. తమిళనాడులో మాత్రమే 69% రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. అంటే పార్లమెంట్లో చట్టం చేసిన అది కోర్టులో లో కూడా నిలబడాలి.రేవంత్ రెడ్డి మరియు మోదీ కులం
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇన్ని ఛాలెంజ్‌ల మధ్య ఉంది. సో ఇన్ని సవాళ్లు ఉన్న అంశాన్ని పక్కదారి పట్టించడానికే ఇప్పుడు రేవంత్ రెడ్డి మోదీ కులాన్ని తెరపైకి తెచ్చారు అనేది బీజేపీ నేతలు చేస్తున్న విమర్శ.Related Posts
యూట్యూబర్లు జర్నలిస్ట్ లా?
యూట్యూబర్లు జర్నలిస్ట్ లా? మీడియా ప్రమాణాలు ఏవి? ఇటీవల కాలంలో సామాజిక మాధ్యమాలు, ముఖ్యంగా యూట్యూబ్, వార్తల ప్రచారం కోసం ఒక ప్రధాన వేదికగా మారింది. ప్రస్తుత Read more
Advertisements
Chhattisgarh లో భారీ ఎన్కౌంటర్
Chhattisgarh లో మరోసారి రక్తపాతం Chhattisgarh ప్రాంతం మరోసారి రక్తసిక్తమైంది. పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన భీకర పోరాటంలో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. రెండు ప్రాంతాల్లో Read more
Uber, Ola కి పోటీగా సహకార టాక్సీ
కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు శుభవార్త కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. కొత్తగా సహకార టాక్సీ వ్యవస్థను రూపకల్పన చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర మంత్రి అమిత్ షా Read more
మారిషస్ ప్రత్యేకతేంటి మోడీ ఎందుకెళ్లారు ?
భారత ప్రధాని మారిషస్ పర్యటన భారత ప్రధాని మారిషస్ దేశాన్ని సందర్శించడం ఓ చారిత్రక ఘటనగా మారింది. భారత తీరానికి సుమారు 4000 కి.మీ. దూరంలో 2000 Read more