హిమాచల్ ప్రదేశ్‌లోని (In Himachal Pradesh) షిమ్లాలో ఓ దారుణ ఘటన కలకలం రేపుతోంది. పదేళ్ల చిన్నారి పాపపై ఓ డాక్టర్ (Doctor) అమానుషంగా ప్రవర్తించాడు. కర్రతో చితకబాదాడు. ఇది కేవలం శారీరక హింస కాదు, మానవత్వాన్ని తుడిచేసిన చర్యగా పలువురు అభిప్రాయపడుతున్నారు.ఘటన వివరాల్లోకి వెళితే, ఛండీగఢ్‌కి చెందిన ఓ డాక్టర్, అతడి భార్య ఏడేళ్ల క్రితం ఓ పాపను దత్తత తీసుకున్నారు. ప్రస్తుతం ఆ పాప వయసు 10 ఏళ్లు. ఇటీవల ఈ కుటుంబం షిమ్లాలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఏ తప్పు చేశిందో స్పష్టంగా తెలియకపోయినా, ఆ చిన్నారి పాపపై డాక్టర్ ఆకస్మికంగా ఆగ్రహం ప్రదర్శించాడు.
కర్రతో చితకబాదిన దృశ్యం కలచివేసింది
కర్రతో పాపను విచక్షణ లేకుండా కొట్టడం మొదలుపెట్టాడు. పాప ఎంత ఏడ్చినా, ఎంత ప్రాధేయపడినా అతడిలో జాలం తలపించలేదు. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా మానవత్వం ఎక్కడుందా అని ప్రశ్నిస్తున్నారు. బాలిక వెక్కి వెక్కి ఏడుస్తున్నా కూడా ఆపకుండా కొట్టడం అందరినీ షాక్‌కు గురిచేసింది.
భార్య ఆపడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది
ఈ ఘటన సమయంలో డాక్టర్ భార్య కూడా అక్కడే ఉంది. ఆమె భర్తను నిలువరించడానికి ప్రయత్నించింది. కానీ అతడు ఆమె మాట విని ఆగలేదు. చిన్నారిని ఇంట్లో పరిగెత్తించి మరింత దారుణంగా హింసించాడు. కొద్ది సేపట్లో అక్కడికి మరో వ్యక్తి చేరుకుని, డాక్టర్‌ను ఆపాడు. అప్పుడే చిన్నారి ఆ హింస నుంచి బయటపడింది.ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్రమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. చిన్నారిపై ఇలా హింస చూపడం ఏ హక్కుతో? అని ప్రశ్నిస్తున్నారు. బాలిక భద్రత కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also : Kerala : కేరళ కొట్టియూర్ పండుగ మహోత్సవానికి వేలాది మంది భక్తులు