సినిమా ఇండస్ట్రీలో ఓటీటీ కొత్త ట్రెండ్‌ను తీసుకొచ్చింది. ఒకప్పుడు థియేటర్లలో భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్‌గా నిలిచిన కొన్ని సినిమాలు ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా, డిఫరెంట్ జానర్ సినిమాలకు ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో ఆశించిన రీతిలో ఆకట్టుకోలేకపోయిన సినిమాలు, ఓటీటీలో హిట్ కొడుతున్నాయి.ఇటీవల విడుదలైన రెండు సినిమాలు ఎమర్జెన్సీ మరియు ఆజాద్ థియేటర్లలో నిరాశపరిచినా, ఓటీటీలో మాత్రం అద్భుతమైన రెస్పాన్స్ పొందుతున్నాయి.
రొమాంటిక్ డ్రామా
ఇదే ఏడాది విడుదలైన మరో సినిమా “ఆజాద్” కూడా థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా రూపొందించబడింది. ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. రవీనా టాండన్ కూతురు రాషా తడానీ కథానాయికగా నటించింది.దర్శకుడు అభిషేక్ కపూర్ ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించగా, దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. కానీ, థియేటర్లలో కేవలం రూ.10 కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టి, బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతూ టాప్ 4 ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.
పొలిటికల్ డ్రామా
బాలీవుడ్ వివాదాస్పద నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన హిస్టారికల్ పొలిటికల్ డ్రామా “ఎమర్జెన్సీ” థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 1975లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ప్రకటించిన అత్యవసర పరిస్థితిని ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ సినిమా, జనవరి 17న విడుదలైంది.అయితే, భారీ అంచనాలతో రూ.60 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.22 కోట్లకే పరిమితమైంది. కానీ, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ, టాప్ 3 ట్రెండింగ్ ప్లేస్‌లో నిలిచింది. ఐఎమ్డీబీ 5.2 రేటింగ్ పొందిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

థియేటర్ ఓటీటీ
ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ రాకతో ప్రేక్షకుల అభిరుచుల్లో భారీ మార్పు వచ్చింది. సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయినా, ఓటీటీలో మాత్రం ప్రేక్షకులకు కనెక్ట్ అయితే, సక్సెస్ అవుతోంది. థియేటర్లో చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని చెప్పవచు, ఓటీటీలో ఇంట్లో కూర్చొని చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు.
థియేటర్ లో పరాజయానికి గలకారణాలు:
కొన్ని సినిమాలు ప్రేక్షకులకు చేరువ కాలేకపోవడం.అంచనాలను అందుకోలేకపోవడం – హైప్ క్రియేట్ చేసిన సినిమాలు, కాన్సెప్ట్ పరంగా నిరాశపరచడం.కాంపిటీషన్ ఎక్కువగా ఉండటం – పెద్ద సినిమాలు విడుదలైన సమయంలో చిన్న చిత్రాలు నిలదొక్కుకోలేకపోవడం.టికెట్ ధరలు, థియేటర్ ఖర్చులు ఎక్కువగా ఉండటం – చాలా మంది ప్రేక్షకులు ఓటీటీలో చూడాలనే ఆలోచనలో ఉండడం.
ఓటీటీలో హిట్ అవ్వడానికి కారణాలు:
కంటెంట్‌కు ప్రాధాన్యం – థియేటర్‌కి వెళ్లి చూడాల్సిన అవసరం లేకుండా, ఇంట్లో సులభంగా వీక్షించగలగడం.చిన్న స్క్రీన్‌లకు అద్భుతంగా సూట్ అవ్వడం – కొన్ని సినిమాలు థియేటర్ కన్నా ఓటీటీ లో చూసేందుకు ఎక్కువ అనువుగా ఉండడం.తక్కువ ఖర్చుతో ఎక్కువ వినోదం – ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో అనేక సినిమాలు చూసే అవకాశం ఉండడం.సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూస్ – ఒకసారి ఓటీటీలో విడుదలైన తర్వాత, మంచి రివ్యూస్ వస్తే ప్రేక్షకుల ఆశక్తిపెరగడం.