భారత వాయుసేనకు చెందిన ఒక ఛీతా హెలికాప్టర్ మంగళవారం పశ్చిమ బెంగాల్‌లో అత్యవసర ల్యాండింగ్ చేసింది. సిలిగురి సమీపంలోని జలపాయ్‌గురి జిల్లా రాజ్‌గంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో, పైలట్ చాకచక్యంగా వ్యవహరించి వ్యవసాయ క్షేత్రంలో భద్రంగా దించాడు.ఈ సంఘటన మధ్యాహ్న సమయంలో జరిగింది. విధుల్లో ఉన్న హెలికాప్టర్ మార్గమధ్యంలో ఒక్కసారిగా సాంకేతిక సమస్యకు లోనైంది. పైలట్ వెంటనే ఆ లోపాన్ని గుర్తించి, సమయస్ఫూర్తితో హెలికాప్టర్‌ను ఆపద నుంచి రక్షించాడు. ప్రమాదాన్ని అడ్డుకున్న అతడి సాహసానికి పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు.అకస్మాత్తుగా పొలాల్లో హెలికాప్టర్ దిగడం చూసిన గ్రామస్తులు మొదట భయాందోళనకు గురయ్యారు.

అయితే, అది భారత వాయుసేనకు చెందిన హెలికాప్టర్ అని గుర్తించి ఊపిరి పీల్చుకున్నారు.అనంతరం వారు పైలట్‌కి నీరు ఇచ్చి సాయం చేశారు. హెలికాప్టర్‌లో ఎవరికీ గాయాలు కాకపోవడం చాలా ఊరటనిచ్చే విషయం.ఘటన స్థలానికి సమాచారం అందిన వెంటనే భారత వాయుసేన బృందం చేరుకుంది. అదే సమయంలో స్థానిక పోలీసులు కూడా అక్కడికి వచ్చి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. హెలికాప్టర్‌ను పరిశీలించిన అధికారులు, అది తాత్కాలికంగా ల్యాండ్ చేయాల్సి వచ్చినటు వెల్లడించారు.
పైలట్ పూర్తిగా సురక్షితంగా ఉన్నాడని కూడా స్పష్టం చేశారు.వాయుసేన అధికారికంగా ప్రకటన చేస్తూ, ఈ సంఘటనకు దారితీసిన సాంకేతిక లోపంపై విచారణ చేపట్టినట్లు పేర్కొంది.హెలికాప్టర్‌ను మరమ్మతుల కోసం మిలిటరీ వాహనాల్లో తరలించే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఘటన జరిగిన ప్రాంతాన్ని తాత్కాలికంగా సురక్షితంగా ముట్టడి చేశారు.ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం అనేకరిని ఊపిరిపీల్చుకునేలా చేసింది. పైలట్ యొక్క అప్రమత్తత, శీఘ్ర స్పందన వల్లే ఇది సాధ్యమైంది. ఇది భారత వాయుసేనలో పైలట్లకు ఉన్న నైపుణ్యానికి ఓ ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది.ఈ ఘటనపై సోషల్ మీడియాలోనూ స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. “భద్రతకే ప్రాధాన్యం ఇచ్చిన ఓ నిజమైన హీరో” అంటూ నెటిజన్లు పైలట్‌ను అభినందిస్తున్నారు. స్థానికులు కూడా భారత వాయుసేన సేవలను పొగుడుతూ మాట్లాడుతున్నారు.
Read Also :Visakhapatnam : విశాఖలో కరాచీ బేకరి పేరుపై వివాదం