తెలంగాణలో వర్షాలు విరమించకుండా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో నేడు,రేపు తీవ్ర వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (low-pressure) ఇప్పుడు మయన్మార్‌లోని (Myanmar) యాంగోన్ తీరానికి దగ్గరగా ఉంది.
వాతావరణ నిపుణులు పేర్కొన్నట్టుగా, ఈ అల్పపీడనం తూర్పు నుంచి క్రమంగా ఉత్తరం వైపుకు కదులుతున్నందున దాని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల (Telugu states) పై ప్రధానంగా కనిపించనుంది.నేడు మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు.

తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
సాయంత్రం 4 గంటల తర్వాత వాతావరణంలో మార్పులు వచ్చి.. విస్తారంగా మేఘాలు ఏర్పడి వర్షాలు కురుస్తాయన్నారు. హైదరాబాద్ (Hyderabad) సహా పశ్చిమ, మధ్య తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని.. రాత్రి 9 గంటల తర్వాత తెలంగాణ అంతటా వర్షాలు మరింత పెరిగి అర్ధరాత్రి 1 గంట వరకు కొనసాగుతాయన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: