Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో(Bay of Bengal) మరోసారి అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది వచ్చే రెండురోజుల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మరింత బలంగా మారే అవకాశం ఉందని తెలిపింది. మరో 24గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయని పేర్కొందది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజులుపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారి ధర్మరాజు పేర్కొన్నారు.

రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మంగళవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ రెండు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. రుతుపవనద్రోణి ప్రభావంతో మహబూబాబాద్, ములుగు, వరంగల్ భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలో పలుచోట్ల భారీ వర్షాలు, ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో(lightning) కూడిన 30-40 కి.మీ వేగంతో గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ధర్మరాజు చెప్పారు.
హైదరాబాద్లో ఉదయం నుంచి కుస్తున్న చిరుజల్లులు
కాగా హైదరాబాద్లో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. ఉదయం నుంచి వాతావరణం చల్లగా మారింది. చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. చందానగర్, మియాపూర్, కొండాపూర్, హఫీజ్పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, దిల్సుఖ్నగర్, వనస్థలిపురంలో వర్షం కురుస్తోంది. అల్పపీడన ప్రభావంతో వరంగల్ కాజీపేటల్లో ఉదయం నుంచి తేలికపాటి వర్షం కురుస్తోంది. రహదారులపై నీరు నిలబడంతో ద్విచక్రవాహనదారులు ఇక్కట్లకు గురవుతున్నారు. రేపు వినాయక చవితి పండుగ సందర్భంగా వరాల సూచనలతో తమ వ్యాపారం దెబ్బతింటుందని వాపోతున్నారు.
ఇతర జిల్లాల్లో వాతావరణం ఎలా ఉంటుందని అంచనా?
మహబూబాబాద్, ములుగు, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు, అలాగే ఇతర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన గాలివానలు కురిసే అవకాశం ఉంది.
ప్రజలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
వర్షాల కారణంగా రహదారులపై నీరు నిలిచిపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ప్రయాణించాలి. అధికారుల సూచనలను పాటించడం అవసరం.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :