Telangana heat weather:తెలంగాణలో మండుతున్న ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలలో సాధారణం కన్నా 3-5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుత వాతావరణం ఎండకాలన్ని తలపించేలా భగభగ మండుతోంది. పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉక్కపోతతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
Read also: El Nino Impact: పాతాళానికి పడిపోయిన బోర్ల నీరు

కళ్ల ముందే ఎండిపోతున్న పంటలు – ఆందోళనలో అన్నదాతలు
ఎండల తీవ్రత పెరగడంతో పాటు మరోవైపు కరెంట్ కోతలు రైతులను కలవరపెడుతున్నాయి. సాగునీరు సక్రమంగా అందక పొలాల్లోని పంటలు ఎండిపోతున్నాయి. నీటి ఎద్దడి కారణంగా పంటలు దెబ్బతింటుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరా సరిగ్గా లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Telangana heat weather:ప్రాణాలను కాపాడుకునే మార్గాలు – ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ తీవ్రమైన ఎండల నుండి రక్షణ పొందడానికి ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి. మధ్యాహ్న సమయాలలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం చాలా ముఖ్యం. శరీరంలో నీటి శాతాన్ని కాపాడుకోవడానికి మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. వడదెబ్బ తగలకుండా తగిన రక్షణ చర్యలు తీసుకుంటూ, వృద్ధులు మరియు పిల్లలు ఇళ్లలోనే ఉండటం మంచిది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: