Rain Alert: జమైకా ఆధునిక చరిత్రలో అత్యంత బలమైనదిగా చెబుతున్న మెలిస్సా తుపాను క్యూబా వైపు వెళుతోంది. తీరం దాటకముందు గంటకు 297 కి.మీపైగా వేగంతో తీరాన్ని తాకిన తుపాను తీరం దాటిన తర్వాత 205 కి.మీల వేగంతో కేటగిరీ 3 స్థాయికి తగ్గింది. మెలిస్సా తుపాను ప్రభావంతో జమైకాలోని కొన్ని ప్రాంతాల్లో 76 సెంటీ మీటర్ల వర్షం కురవచ్చని అంచనా వేశారు. ‘ఈదురుగాలులు ఎంత బలంగా ఉన్నాయంటే మీరు రోడ్డు మీద నిల్చోవడం కూడా కష్టంగా ఉంది’ అని జమైకాకు చెందిన ప్రజలు అంటున్నారు.
Read also: TG Red Alert:పలు జిల్లాల్లో అతి భారీ వర్షాల హెచ్చరిక

Rain Alert: జమైకాలో మెలిస్సా తుపాను విధ్వంసం
Rain Alert: అంతకుముందు మెలిస్సా తుపానును కేటగిరీ 5గా వర్గీకరించారు. కొన్ని గంటల్లో ఈ తుపాను క్యూబాను తాకనుంది. తుపాను బాధితుల కోసం 800 షెల్టర్లు జమైకాలో తుపాను బాధితుల కోసం 800 షెల్టర్లను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. గత రాత్రి 15వేలమంది షెల్టర్లకు వచ్చారని వెల్లడించారు. మెలిస్సా తుపాను కారణంగా క్యూబాలో 60 సెంటీమీటర్ల వర్షం కురుస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తుపాను బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ఇక్కడి అధికారులు సూచిస్తున్నారు. ద్వీపంలోని రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసివేశారు. వారంతం వరకు విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు చెప్పారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: