రాష్ట్రవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఈ మధ్య కాలంలో గణనీయంగా మారిపోయాయి. సాధారణంగా జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు ప్రబలంగా ప్రవేశించి దేశం అంతటా వర్షాలు కురవడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది ఈ రుతుపవనాలు కొంత ముందుగానే దక్షిణాంధ్రను తాకినప్పటికీ, అనూహ్యంగా నెమ్మదించిపోయాయి. దీని ప్రభావం వలన ఆశించిన వర్షాలు ఆలస్యం (rainsarelate) కావడంతో మళ్లీ వేసవికాల వాతావరణ లక్షణాలు ఎదురవుతున్నాయి.

ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పరిస్థితి
వాతావరణ శాఖ వివరాల ప్రకారం, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించిన స్థాయిలో నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటున్నాయని వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ తర్వాతే రుతుపవనాల్లో మళ్లీ కదలిక వచ్చి, అవి చురుగ్గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
వాతావరణంలోని అస్థిరత – ఉరుములు, ఈదురుగాలుల వానలు
పగటి వేడి పెరగడం, ఆపై సాయంత్రం సమయంలో చల్లటి గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలుచోట్ల కురుస్తున్నాయి.ఈ రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 36 నుంచి 40 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే, రుతుపవనాలు విస్తరించే క్రమంలో ఇలా మధ్యమధ్యలో కొన్ని రోజుల పాటు విరామం తీసుకోవడం అనేది సాధారణ ప్రక్రియేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వాతావరణ శాఖ నిపుణులు వివరిస్తున్నారు.
రైతుల నిరీక్షణ – వ్యవసాయానికి అనుకూల వాతావరణం ఎప్పటికి?
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా పగటివేళల్లో ఉక్కపోత, రాత్రివేళల్లో తేలికపాటి చల్లదనం, సాయంత్రం వేళల్లో అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జూన్ రెండో వారం నుంచి వర్షాలు పుంజుకుని, వ్యవసాయ పనులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మట్టి తేమ పెరగడం, విత్తనాలు నాటడానికి అవసరమైన వర్షపాతం లభించడంతో వ్యవసాయ కార్యకలాపాలు ఊపందుకోవచ్చని రైతుల అభిప్రాయం.
Read also: Magam Ranga Reddy : మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి మృతి
Local Body Elections : 2 నెలల్లో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు?