runamafi ponguleti

అందరికి రుణమాఫీ చేసి తీరుతాం – పొంగులేటి

అర్హులైన రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం గడిచిన పదేళ్లలో రూ.13,500 కోట్లు రెండు విడతలుగా మాఫీ చేస్తే ప్రస్తుతం ప్రభుత్వం 26 రోజుల్లో రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేసిందని, ఇంకా 13 వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం మాట ఇస్తే తప్పదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రూ.13 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని పొంగులేటి చెప్పారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. తెలంగాణలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 10 నెలలు పూర్తయినా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదు. తొలుత పూర్తిగా రుణమాఫీ జరిగిందని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహా పలువురు మంత్రులు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం అదే తీరుగా మాట్లాడారు. కానీ విపక్షాలు లెక్కలు బయటపెట్టడం, మరోవైపు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చెప్పిన లెక్కలు, బడ్జెట్ సమయంలో వెల్లడించిన రుణమాఫీ వివరాలు, జులై, ఆగస్టులో జరిగిన రుణమాఫీ లెక్కలు సరికాకపోవడం తో ప్రభుత్వం ఫై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి రుణమాఫీ పై మరోసారి క్లారిటీ ఇచ్చారు.

Related Posts
తిరుమల కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేస్తే ఉపేక్షించం – టీటీడీ ఛైర్మన్
BR Naidu tirumala

తిరుమలలో భక్తుల ప్రశాంతతకు భంగం కలిగించేలా ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా ఉపేక్షించబోమని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టంచేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. Read more

మందు బాబులకు షాక్ ఇచ్చిన బాబు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మందుబాబులకు షాక్‌ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలను 15 శాతం పెంచుతూ ఏపీ ఎక్సైజ్‌ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం Read more

ఈ నెల 26 నుంచి రేషన్‌కార్డుల మంజూరు
ration card

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 26 నుంచి రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించేందుకు ముహూర్తం గా నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పటికే గ్రామ.. బస్తీ సభలు నిర్వహిస్తోంది. Read more

పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
Supreme Court verdict on PG

పీజీ మెడికల్ సీట్ల కేటాయింపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర కోటా ఆధారంగా సీట్ల కేటాయింపు ఇకపై చెల్లదని స్పష్టం చేసింది. రాష్ట్రాల కోటాలో 50 Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *