We will know their whereabouts in two days.. Minister Uttam

రెండు రోజుల్లో వారి ఆచూకీ తెలుసుకుంటాము : మంత్రి ఉత్తమ్

పక్కా ప్లాన్ ప్రకారం ముందుకు

హైదరాబాద్‌: ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక కామెంట్స్ చేసారు. అక్కడ పేరుకుపోయిన మట్టి నీరు సిల్ట్ ఉంది. 15 నుండి 20 మీటర్ల వరకు బురద నీటితో కూరుకుపోయింది. దేశంలోని బెస్ట్ ఆర్మీ ఆఫీసర్ లను రప్పించాము. గ్యాస్ కట్టర్ లలో tbm మిషన్ భాగాలను తొలగించేందుకు నిర్ణయించుకున్నాం. నిన్న వాటర్ బయటికి పంపే ప్రయత్నంలో రిస్క్యూ ఆపరేషన్ కాస్త లేట్ అయ్యింది. రెస్క్యూ లో పాల్గొనే వారు రిస్క్యూలో పడకూడదని నిర్ణయంతో ముందుకు వెళుతున్నాము. అధికారులు అంతా నిబద్ధతతో పని చేస్తున్నారు.

రెండు రోజుల్లో వారి ఆచూకీ

దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు

సిల్ట్ లోకీ వెళ్ళి కూరుకుపోయిన వారిని బయటకు తెచ్చేందుకు ఇప్పటి నుండే యాక్షన్ ఉంటుంది. బెస్ట్ టన్నెల్ ఎక్స్ పర్ట్ లను రప్పించాము. మరో రెండు రోజుల్లో వారి ఆచూకి తెలుసుకుంటాము. వారు బ్రతికి వున్నారనే నమ్మకంతో రెస్క్యూ మిషన్ వేగవంతం చేసాము.. రెస్క్యూ మిషన్ లో చాలా సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. ప్లాస్మా కట్టర్, వెల్డింగ్ పరికరాలతో tbm మిషన్ వెనుక భాగాన్ని తొలగిస్తాం. దీన్ని రాజకీయ కోణంలో చూడకూడదు అని మంత్రి కోరారు.

ఎక్స్‌పర్ట్స్‌ సూచనలతో ఈ రెస్క్యూ ఆపరేషన్‌

ఇక గతంలో ఎక్కడ టన్నెల్‌ ప్రమాదం జరిగినా సహాయక చర్యల్లో పాల్గొన్న రెస్క్యూ టీమ్‌ను తీసుకొచ్చి.. లోపల చిక్కుకున్న వారిని బయటికి తీసుకువచ్చేలా సాయం తీసుకుంటున్నామని తెలిపారు. దేశ, విదేశాల్లో ఉన్న టన్నెల్‌ ఎక్స్‌పర్ట్స్‌ సూచనలతో ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను ముందుకు తీసుకెళ్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడటమే తమ ప్రభుత్వ అంతిమ లక్ష్యమని తెలిపారు. దేశ సరిహద్దులో టన్నెల్ నిర్మించిన టీబీఎం నిపుణులను టన్నెల్ లోపలికి పంపించి.. రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేసినట్లు చెప్పారు.

Related Posts
కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్‌ను సీజ్ చేసిన అధికారులు
Officials seized the Stella ship at Kakinada port

అమరావతి: కాకినాడ పోర్టులో స్టెల్లాషిప్‌ను అధికారులు సీజ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ తనిఖీల తర్వాత కదిలిన అధికార యంత్రాంగం..కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ సీజ్ చేసింది. Read more

ఏపీ నూతన డీజీపీ ఈయనేనా..?
ap new dgp harish kumar gup

ఆంధ్రప్రదేశ్‌లో డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ విరమణ సమయం దగ్గరపడుతుండడంతో నూతన డీజీపీ నియామకంపై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం విజయనగరం జిల్లాకు చెందిన హరీశ్ కుమార్ Read more

తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ విద్య
AI Study

తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ విద్య.తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కొత్త ప్రయోగాలను ప్రారంభిస్తోంది. విద్యార్థుల పఠన సామర్థ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో, ప్రభుత్వ పాఠశాలల్లో Read more

త్వరలో భారత్ లోకి టెస్లా ఎంట్రీ – మంత్రి వాసంశెట్టి సుభాష్
vasam

ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ వాహన పరిశ్రమలో ఓ విప్లవాత్మక మార్పును తీసుకొచ్చిన టెస్లా త్వరలోనే భారత్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించబోతుందని సమాచారం. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఈ దిగ్గజ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *