We will convert Sheesh Mahal into a museum.. Rekha Gupta

శీష్‌ మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం : రేఖా గుప్తా

నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించాం, కానీ కేజ్రీవాల్..

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఢిల్లీలో ‘శీష్‌ మహల్‌’ పేరు విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆ బంగ్లాను మ్యూజియంగా మార్చనున్నట్లు ప్రకటించారు.”ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తాం. అలాగే, నాకు ఈ పదవిని ఇచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని ఆమె మీడియాతో వెల్లడించారు.

Advertisements
image

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో, ఆయన సివిల్ లైన్స్‌లో 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని బంగ్లాను అధికారిక నివాసంగా ఉపయోగించేవారు. అయితే, బీజేపీ ఈ బంగ్లాను ‘శీష్ మహల్’ (అద్దాల మేడ)గా అభివర్ణించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, కేజ్రీవాల్ దాన్ని ఏకంగా 7-స్టార్ రిసార్ట్‌గా మార్చుకున్నారని తీవ్ర విమర్శలు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ”నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించాం, కానీ కేజ్రీవాల్ మాత్రం అద్దాల మేడను నిర్మించుకున్నాడు” అంటూ ఎద్దేవా చేశారు.

బీజేపీ ఈ బంగ్లాను ఉపయోగించకూడదని నిర్ణయం

ఆప్ మోసాలను అద్దాల మేడగా చూపిస్తూ, బీజేపీ దీన్ని ఎన్నికల ప్రచారంలో ఓ ప్రధాన అంశంగా తీసుకుంది. ఈ అవినీతి ఆరోపణలు ఆమ్‌ఆద్మీ పార్టీకి భారీగా నష్టం కలిగించాయి, చివరకు బీజేపీకి విజయాన్ని అందించాయి. ప్రజల్లో అనవసర విమర్శలు రాకుండా ఉండేందుకు, బీజేపీ ఈ బంగ్లాను ఉపయోగించకూడదని ముందుగానే నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఢిల్లీకి కొత్తగా వచ్చనున్న ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈ బంగ్లాలో నివసించే అవకాశం లేదన్న ఊహాగానాల నడుమ, ఆమె తాజా ప్రకటనతో ఈ అంశానికి క్లారిటీ వచ్చింది.

Related Posts
ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు తీపి కబురు
ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు తీపి కబురు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై, ప్రభుత్వ ఉద్యోగుల ప్రసూతి సెలవులపై ఉన్న పరిమితిని ఎత్తివేస్తున్నట్టు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. Read more

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు సర్వం సిద్ధం
జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు సర్వం సిద్ధం

జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు సర్వం సిద్ధం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి. "జయకేతనం" పేరుతో నిర్వహించే ఈ సభ Read more

కాంగ్రెస్ నేతలకు హెచ్చరికలు జారీ చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్
paadi

హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి దళితబంధు రెండో విడత నిధుల పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ నెల 20 వరకు నిధులు అందకపోతే Read more

నాని షాకింగ్ డెసిషన్: ఇకపై బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మానుకున్న ‘లోకల్ బాయ్’ నాని - సజ్జనార్‌కు క్షమాపణలు!

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మానుకున్న ‘లోకల్ బాయ్’ నాని - తన నిర్ణయం వెనుకున్న అసలు కారణం! సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ సంపాదించిన యూట్యూబర్ ‘లోకల్ Read more

Advertisements
×