We will convert Sheesh Mahal into a museum.. Rekha Gupta

శీష్‌ మహల్‌ను మ్యూజియంగా మారుస్తాం : రేఖా గుప్తా

నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించాం, కానీ కేజ్రీవాల్..

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఢిల్లీలో ‘శీష్‌ మహల్‌’ పేరు విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆ బంగ్లాను మ్యూజియంగా మార్చనున్నట్లు ప్రకటించారు.”ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తాం. అలాగే, నాకు ఈ పదవిని ఇచ్చినందుకు ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు” అని ఆమె మీడియాతో వెల్లడించారు.

image

ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో, ఆయన సివిల్ లైన్స్‌లో 6 ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌లోని బంగ్లాను అధికారిక నివాసంగా ఉపయోగించేవారు. అయితే, బీజేపీ ఈ బంగ్లాను ‘శీష్ మహల్’ (అద్దాల మేడ)గా అభివర్ణించింది. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి, కేజ్రీవాల్ దాన్ని ఏకంగా 7-స్టార్ రిసార్ట్‌గా మార్చుకున్నారని తీవ్ర విమర్శలు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ”నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించాం, కానీ కేజ్రీవాల్ మాత్రం అద్దాల మేడను నిర్మించుకున్నాడు” అంటూ ఎద్దేవా చేశారు.

బీజేపీ ఈ బంగ్లాను ఉపయోగించకూడదని నిర్ణయం

ఆప్ మోసాలను అద్దాల మేడగా చూపిస్తూ, బీజేపీ దీన్ని ఎన్నికల ప్రచారంలో ఓ ప్రధాన అంశంగా తీసుకుంది. ఈ అవినీతి ఆరోపణలు ఆమ్‌ఆద్మీ పార్టీకి భారీగా నష్టం కలిగించాయి, చివరకు బీజేపీకి విజయాన్ని అందించాయి. ప్రజల్లో అనవసర విమర్శలు రాకుండా ఉండేందుకు, బీజేపీ ఈ బంగ్లాను ఉపయోగించకూడదని ముందుగానే నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఢిల్లీకి కొత్తగా వచ్చనున్న ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈ బంగ్లాలో నివసించే అవకాశం లేదన్న ఊహాగానాల నడుమ, ఆమె తాజా ప్రకటనతో ఈ అంశానికి క్లారిటీ వచ్చింది.

Related Posts
మరో ఎన్‌కౌంటర్..ఇద్దరు మావోయిస్టుల హతం
Another encounter..killed two Maoists

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా భాష కూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండ్ర అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా Read more

హైదరాబాద్ కేంద్రానికి చెందిన అగ్నివీరుల మృతి.
agniveer

హైదరాబాద్ ఆర్టిలరీ కేంద్రానికి చెందిన ఇద్దరు అగ్నివీరులు మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో జరగిన దురదృష్టకరమైన ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఫైరింగ్ ప్రాక్టీస్ సమయంలో ఇండియన్ ఫీల్డ్ గన్‌లోని Read more

రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..!
CM Revanth Reddy meet with Rahul Gandhi..!

టెన్ జన్‌పథ్‌లో పార్టీ అగ్రనేతను కలిసిన రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ Read more

బడే చొక్కారావు బతికే ఉన్నాడా..?
maoist bade chokka rao

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ సెక్రటరీ దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించారు. అయితే, ఈ ప్రకటనపై మావోయిస్టు పార్టీ Read more