Narendra Modi :మేం కోరేది స్నేహమే శత్రుత్వం కాదు :మోదీ

Narendra Modi :మేం కోరేది స్నేహమే శత్రుత్వం కాదు :మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ ఏఐ పరిశోధకుడు లెక్స్ ఫ్రిడ్‌మెన్‌తో జరిగిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. భారత్-చైనా సంబంధాలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిణామాలు, గోద్రా అల్లర్లు,తదితర అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

శాంతి కోసం ప్రయత్నాలు

భారత్, చైనా వివాదంలో శాంతి కోసమే తాము కృషి చేస్తున్నామన్నారు ప్రధాని మోదీ. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ముగింపు చర్చల ద్వారానే సాధ్యమని మరోసారి స్పష్టం చేశారు. గోద్రా అల్లర్ల అంశంలో తాము నిర్దోషులమని కోర్టు తేల్చిందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ ద్వారానే తన జీవితానికి ఒక అర్థం దొరికందన్నారు. 

ఉక్రెయిన్-రష్యా యుద్ధం

రష్యా ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు చర్చల ద్వారానే సాధ్యమని ప్రధాని మోదీ అన్నారు. మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ యుద్ధాన్ని ముగించేందుకు రెండు దేశాలు చర్చలకు సిద్ధం కావాలని సూచించారు. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన మొదటి టర్మ్‌తో పోలిస్తే, రెండో టర్మ్‌లో మరింత సన్నద్ధంగా కనిపిస్తున్నారని మోదీ తెలిపారు. ఈసారి ట్రంప్ మునుపటికంటే బాగా ప్లాన్ చేసినట్టు అనిపిస్తోందన్నారు. ఆయన మనసులో స్పష్టమైన రోడ్‌మ్యాప్ ఉందని అభిప్రాయపడ్డారు.

పాకిస్తాన్‌పై ప్రధాని వ్యాఖ్యలు

ఆసియా దేశాల్లో భాగమైన పాకిస్తాన్ ఎప్పుడూ తమతో శత్రుత్వాన్ని మాత్రమే కోరుకుంటోందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. వారితో ఎప్పుడూ శాంతి చర్చలకోసం ప్రయత్నించినా అది విఫలయత్నంగానే మిగిలిపోయిందన్నారు. లెక్స్ ఫ్రిడ్‌ మ్యాన్‌తో జరిగిన పాడ్ కాస్ట్‌లో అనేక అంశాలపై స్పందించారు. 

ఆర్‌ఎస్‌ఎస్‌ గురించి ప్రధాని మోదీ అభిప్రాయాలు

ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారా తన జీవితానికి ఒక లక్ష్యం దొరికిందన్నారు ప్రధాని మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌ సేవా భావం, రామకృష్ణ మిషన్, స్వామి వివేకానంద బోధనలు తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించాయని వెల్లడించారు.

pm modi podcast 3

గోద్రా అల్లర్లు

గోద్రా అల్లర్ల విచారణ సమయంలో తమ రాజకీయ ప్రత్యర్థులు కేంద్రంలో అధికారంలో ఉన్నారన్నారు ప్రధాని మోదీ. ఈ అంశంలో తమపై అనేక రకాలుగా దుష్ప్రచారం చేశారన్నారు. వాళ్లు ఎంత ప్రయత్నించినా, న్యాయవ్యవస్థ రెండుసార్లు ఈ విషయాన్ని లోతుగా పరిశీలించి, తమను నిర్దోషులుగా తేల్చిందని గుర్తు చేశారు. ప్రధాని మోదీ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు భారత్-చైనా సంబంధాలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిణామాలు,దేశ రాజకీయాలు, ఆర్‌ఎస్‌ఎస్, గోద్రా ఘటనల వంటి అంశాలపై మాట్లాడారు ముఖ్యంగా, చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించాలనే మోదీ అభిప్రాయానికి రాజకీయ విశ్లేషకులు స్పందిస్తున్నారు.

Related Posts
విజయ్ రాజకీయ అరంగేట్రం పై సూపర్ స్టార్ స్పందన
rajanikanth vijay

తమిళ స్టార్ హీరో విజయ్ తమిళ రాజకీయాల్లోకి ప్రవేశించడం తమిళనాడులో రాజకీయంగా పెద్ద సంచలనం రేపుతోంది. విజయ్ తన కొత్త రాజకీయ పార్టీ "తమిళగ వెట్రి కళగం" Read more

ఈస్ట్ కోస్ట్‌లో డ్రోన్ సంఘటనలపై ట్రంప్ స్పందన
trump

డొనాల్డ్ ట్రంప్ సోమవారం రోజున అమెరికా సైన్యాన్ని ఇటీవల ఈస్ట్ కోస్ట్‌లో కనిపించిన డ్రోన్‌ల గురించి ప్రజలకు వివరాలు ఇవ్వాలని కోరారు. "ప్రభుత్వానికి ఏం జరుగుతుందో తెలుసు," Read more

ఢిల్లీ సీఎం అబద్ధాలు చెబుతున్నారు: బిజెపి ఆరోపణ
ఢిల్లీ సీఎం అబద్ధాలు చెబుతున్నారు: బిజెపి ఆరోపణ

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించడానికి ఒక రోజు ముందు, భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని కేంద్రం, ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిని తన Read more

ఏనుగుల ఊరేగింపులో హమాస్ నేతల ఫోటోలు
ఏనుగుల ఊరేగింపులో హమాస్ నేతల ఫోటోలు

కేరళలోని పాలక్కడ్‌లో గత ఆదివారం జరిగిన త్రిథాల సాంస్కృతిక ఉత్సవం మరోసారి వివాదాస్పదం అయింది. ఇందుకు హమాస్‌ నాయకుల ఫోటోలను పట్టుకొని ఏనుగులపైకి యువకులు ఎక్కడమే కారణం. Read more