బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువతను ఆకర్షించేందుకు ఉత్సాహంగా ప్రయత్నిస్తున్నారు. గత ఐదేళ్లలో (2020-25) ఇచ్చిన ఉద్యోగాల హామీని తాము నెరవేర్చామని చెప్పారు. మొత్తం 50 లక్షల మందికి ఉపాధి కల్పించామని వెల్లడించారు. ఇందులో 10 లక్షల మందికి ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు, మిగిలిన 39 లక్షల మందికి ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు.
కోటి ఉద్యోగాల లక్ష్యం
నితీశ్ కుమార్ తదుపరి లక్ష్యాన్ని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు ఇవ్వడమే తమ ప్రభుత్వ ప్రధాన టార్గెట్ అని వెల్లడించారు. ఈ టార్గెట్‌ను ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం, స్టార్ట్‌అప్స్, వ్యవసాయం, స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా సాధించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతోందని చెప్పారు. యువతకు స్థిర ఉపాధిని అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని నితీశ్ తెలిపారు.
ఎన్నికల ముంగిట రాజకీయ ప్రలోభాల విమర్శలు
నితీశ్ కుమార్ హామీలపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఎన్నికల ముందు పెద్ద పెద్ద హామీలతో యువతను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నాయి. గత హామీలను నెరవేర్చిన దానిపై సమగ్ర అంకెలతో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, నితీశ్ కుమార్ మాత్రం తాము చెప్పిన ప్రతి మాటను నెరవేర్చామని, భవిష్యత్ లో మరింత మెరుగైన అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తున్నారు.
Read Also : Godavari : 60 ఏళ్లు పూర్తి చేసుకున్న భద్రాచలం గోదావరి వంతెన