We have not received a response from India to our request.. Yunus

తాము చేసిన అభ్యర్థనకు భారత్‌ నుంచి స్పందన రాలేదు: యూనస్‌

ఢాకా: భారత్‌ను మాజీ ప్రధాని షేక్‌ హసీనా అప్పగింతపై అధికారికంగా సంప్రదించినట్లు బంగ్లాదేశ్‌ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ వెల్లడించారు. కానీ, భారత్‌ నుంచి ఇప్పటివరకు అధికారిక సమాధానమేదీ రాలేదని తెలిపారు. అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రిజర్వేషన్ల వ్యతిరేక నిరసనల్లో పెద్దఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో గతేడాది ఆగస్టులో హసీనా దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి భారత్‌లో ఆమె తలదాచుకుంటున్నారు. హసీనాతో పాటు ఆమె హయాంలోని పలువురు మాజీ మంత్రులు, సలహాదారులు, పలువురు అధికారులు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారంటూ బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ వారిపై అరెస్టు వారెంట్లు జారీ చేసింది. హసీనాతో పాటు ఆమెకు సంబంధించిన వ్యక్తులపై విచారణ జరుగుతుంది అని యూనస్ వెల్లడించారు.

తాము చేసిన అభ్యర్థనకు భారత్‌

ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై ఎటువంటి వ్యాఖ్య చేయలేము

అలాగే తమ అప్పగింత అభ్యర్థనపై భారత్‌ నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదని చెప్పారు. షేక్‌ హసీనాను అప్పగించాలంటూ బంగ్లాదేశ్‌ లేఖ రాసిన విషయాన్ని భారత్‌ ఇప్పటికే ధ్రువీకరించింది. షేక్‌ హసీనా అప్పగింతకు సంబంధించి బంగ్లాదేశ్‌ హై కమిషన్‌ నుంచి లేఖ అందింది. ప్రస్తుత పరిస్థితుల్లో దీనిపై ఎటువంటి వ్యాఖ్య చేయలేము అని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి పేర్కొన్న విషయం తెలిసిందే. ఇటీవల అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటుచేసిన ఓ బహిరంగ కార్యక్రమంలో.. హసీనా జూమ్‌కాల్‌ ద్వారా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె కార్యకర్తలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. తాను బంగ్లాకు తిరిగి వస్తానని, పార్టీ కార్యకర్తల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. గతంలో మాదిరిగానే అందరికీ న్యాయం చేస్తానని అన్నారు. మధ్యంతర ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు గడుస్తున్నా.. అల్లర్లు ఆగట్లేదని అన్నారు. యూనస్ ఓ ఉగ్రవాది అని విమర్శించారు. ఆమెను తమ దేశంలోకి రప్పించడమే తమ అత్యంత ప్రాధాన్యమైన లక్ష్యమని ఆ వ్యాఖ్యలపై తాత్కాలిక ప్రభుత్వం స్పందించింది.

Related Posts
చేజారిన గౌతమ్ అదానీ రూ.8,500 కోట్ల ప్రాజెక్ట్
చేజారిన గౌతమ్ అదానీ రూ.8,500 కోట్ల ప్రాజెక్ట్

భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని దేశాల్లో వ్యాపారాలను నిర్వహిస్తున్న వ్యాపారవేత్త గౌతమ్ అదానీ. అనూహ్యంగా ఆయనను టార్గెట్ చేసిన హిండెన్ బర్గ్ తన వ్యాపార కార్యకలాపాలను Read more

మహాకుంభ మేళా పవిత్ర స్నానాల తేదీలు
kumbh mela

మహాకుంభ మేళాకు తుది ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 45 కోట్ల మంది భక్తులు హాజరయ్యే ఈ భారీ కార్యక్రమం కోసం సుమారు రూ 7500 కోట్లు ఖర్చు Read more

రష్యాపై ఆంక్షలు ఎత్తివేసే దిశగా ట్రంప్ అడుగులు
రేపు పుతిన్‌తో ఫోన్ లో మాట్లాడనున్న ట్రంప్?

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ ఘర్షణ ముగిసే సూచనలు కనిపించడంలేదు. మరోవైపు, రష్యాకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో కూడా మద్దతుగా Read more

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
delhi elections 2025

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఓటర్లు ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరు Read more