ఉచిత విద్యుత్ కోసం భారీగా ఖర్చు – మంత్రి గొట్టిపాటి కీలక ప్రకటన

ఉచిత విద్యుత్ కు భారీగా ఖర్చు చేస్తున్నాం:గొట్టిపాటి

రాష్ట్రంలో రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతులకు సమర్థవంతమైన విద్యుత్ సరఫరా, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల విస్తరణపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 40,336 వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయగా, 22,709 కనెక్షన్లు ఇప్పటికే వినియోగంలోకి వచ్చాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్‌ కోసం ప్రతి ఒక్కదానికి సుమారు రూ.2.60 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉచిత విద్యుత్‌ సరఫరా కోసం కూటమి ప్రభుత్వం రూ.12,400 కోట్లు వెచ్చిస్తోందని వివరించారు.

1876072 1

ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు

గత ప్రభుత్వ హయాంలో ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు విషయంలో అసమానతులు, వివిధ రేట్లలో కొనుగోలు చేసిన తీరును మంత్రి ఎండగట్టారు. ఇకపై ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు ఒకే రేటుకు ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలు జరిగినా, రైతులు సమాచారం అందిస్తే వెంటనే కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఉచితంగా ఇస్తామని తెలిపారు. డిస్కమ్‌ల మధ్య ట్రాన్స్‌ఫార్మర్ల ధరల్లో ఎలాంటి వ్యత్యాసం లేకుండా చూడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

విద్యుత్ సరఫరా & జగన్ విమర్శలపై మంత్రి స్పందన

ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే, జగన్ తట్టుకోలేక అసత్య ప్రచారానికి దిగుతున్నారని మంత్రి విమర్శించారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల ప్రయోజనంపై సరైన అవగాహన లేక జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఎలాంటి అదనపు భారం లేకుండా ప్రజలకు మెరుగైన విద్యుత్ అందిస్తోంది. అయితే పీఎం కుసుమ్, సూర్యఘర్ పథకాల వల్ల ఏమాత్రం నష్టం ఉందో జగన్ చెప్పాలి అని మంత్రి గొట్టిపాటి ప్రశ్నించారు.

సూర్యఘర్, పథకాల ప్రాముఖ్యత

ప్రస్తుతం కుప్పంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ‘సూర్యఘర్’ పథకాన్ని రాష్ట్రమంతటా విస్తరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు ఉచితంగా సౌర ఫలకాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకాలు రైతులకు నూతన శక్తిని ఇచ్చేలా రూపొందించామని మంత్రి స్పష్టం చేశారు.

ఉచిత వ్యవసాయ విద్యుత్ కోసం భారీ బడ్జెట్ , 40,336 కొత్త వ్యవసాయ కనెక్షన్ల మంజూరు ,
ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలపై ప్రత్యేక చర్యలు , సౌర విద్యుత్ ద్వారా రైతులకు ప్రయోజనం
పీఎం కుసుమ్, సూర్యఘర్‌ పథకాల ప్రాముఖ్యత రైతుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం పరిపాలనలో పారదర్శకతతో పాటు, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి స్పష్టం చేశారు. జగన్ రెడ్డి చేసిన అక్రమ వసూళ్లు చంద్రబాబు హయాంలో కట్టాల్సి వస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వ సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక ‘సాక్షి’ పత్రిక ద్వారా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Related Posts
ఏపీలో అర్హులైన అందరికి త్వరలో నూతన రేషన్ కార్డులు
New ration cards for all eligible in AP soon

అమరావతి: రేషన్ కార్డు లేని అర్హులైన పేదలకు త్వరలోనే వాటిని మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్‌కార్డుల్లో పేరు మార్పు చేర్పులకు కూడా అవకాశం ఇవ్వనుంది. Read more

వివేకా కేసులో సాక్షుల మరణాల పై దర్యాఫ్తు
వివేకా కేసులో సాక్షుల మరణాల పై దర్యాఫ్తు

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు: సాక్షుల మరణాలు, అనుమానాలు మరియు సమగ్ర దర్యాఫ్తు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ప్రస్తుతం కీలక దశలో ఉంది. Read more

ఏపీ పర్యటనకు వెళ్లనున్న అమిత్‌షా
image

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం (18వ తేదీ) ఏపీ పర్యటనకు వెళ్లనున్నారు. కృష్ణా జిల్లా , గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ , ఎన్ఐడీఎం Read more

బాలిక పై కన్నతండ్రే అఘాయిత్యం
బాలిక పై కన్నతండ్రే అఘాయిత్యం

నాన్న అంటే ఆశ్రయం, రక్షణ, భద్రత. పిల్లల భవిష్యత్తు కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటాడు. ప్రతి తండ్రి తన బిడ్డల కోసం తమ జీవితాన్ని అర్పిస్తారు. Read more