image

ఏపీ పర్యటనకు వెళ్లనున్న అమిత్‌షా

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం (18వ తేదీ) ఏపీ పర్యటనకు వెళ్లనున్నారు. కృష్ణా జిల్లా , గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్ , ఎన్ఐడీఎం ప్రాంగణాలను కేంద్ర హోం మంత్రి ప్రారంభించనున్నారు. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరానికి వస్తారు. ఆ రోజు రాత్రి ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షాకు విందు ఏర్పాటు చేశారు. అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేస్తారు. 19న ఉదయం ఎన్ఐడీఎం కేంద్రం, ఎన్డీఆర్ఎఫ్ పదో బెటాలియన్‌ను ఆయన ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తదితరులు పాల్గొంటారు. ప్రారంభోత్సవం తర్వాత అమిత్ షా బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.

Advertisements

విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్మించిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తో పాటు పదో బెటాలియన్ ఎన్డీఆర్ఎఫ్ క్యాంపులను అమిత్ షా ప్రారంభిస్తారు. ఇవి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలోనివి కావడంతో ఆయన ప్రత్యేకంగా వస్తున్నారు. ఈ పర్యటన రాజకీయంగా కూడా ఆసక్తి రేపుతోంది. అమిత్ షా పర్యటన కోసం ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. సాధారణంగా రాజకీయాలను అమిత్ షానే పట్టించుకుంటంటారు. పాలన పరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజీగా ఉంటారు. అయితే అంతిమ నిర్ణయం తీసుకునేది ప్రధాని మోడీనే. పనులన్నీ చక్కబెట్టేది అమిత్ షా. ఏపీ పర్యటనలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఈ ముగ్గురి మధ్య రాజకీయ చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

image
image

కాగా, ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పాలన చేపట్టి ఏడు నెలలు గడుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దుతూ ముందుకు సాగుతున్నారు. వైఎస్సార్‌సీపీ నిర్వాకాల కారణంగా ఎన్నో బ్యాక్ లాగ్స్ పెండింగ్‌లో ఉన్నాయని .. వాటిని క్లియర్ చేయాల్సి ఉందని అంటున్నారు. జగన్ హయాంలో జరిగిన అనేక అవకతవకలపై నివేదికలు సిద్ధంగా ఉన్నాయి. అందులో కొన్నింటిలో కేంద్ర దర్యాప్తు సంస్థల ఇన్వాల్వ్ మెంట్ అవసరమని భావిస్తున్నారు. ఈ క్రమంలో అన్నింటిపై ముగ్గురు నేతల మధ్య చర్చలు జరిగే అవకాశముందని తెలియవచ్చింది.

  • Read more :

Related Posts
పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో మోదీ, ఖర్గేల అప్యాయ పలకరింపు
PM, Mallikarjun Kharge's light moment at event to pay tribute to Ambedkar

పార్లమెంట్ ఆవరణలో అరుదైన సన్నివేశం చోటుచేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మధ్య ఆప్యాయ పలకరింపులు అందరినీ ఆకట్టుకున్నాయి. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ Read more

2500 కోట్లతో నిర్మించబడుతున్న ఉస్మానియా హాస్పిటల్
2500 కోట్లతో నిర్మించబడుతున్న ఉస్మానియా హాస్పిటల్

ఉస్మానియా ఆస్పత్రి, హైదరాబాద్‌లోని ప్రఖ్యాత వైద్య సంస్థ, సరికొత్తగా, ఆధునిక సౌకర్యాలతో మారిపోతుంది. నిజాం కాలంలో ప్రారంభమైన ఈ ఆస్పత్రి, 100 ఏళ్ల పైచిలుకు చరిత్రను కలిగి Read more

దోమల పెంట ఎస్ ఎల్ బి సి టన్నల్ లో చిక్కుకున్న 8 మంది సిబ్బంది
8 మంది సిబ్బంది

దోమల పెంట ఎస్ ఎల్ బి సి టన్నల్ లో చిక్కుకున్న 8 మంది సిబ్బంది – రెస్క్యూ ఆపరేషన్ నాగర్ కర్నూల్ జిల్లా దోమల పెంట Read more

తెలంగాణలో చలి బీభత్సం: ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
తెలంగాణలో చలి బీభత్సం: ఉష్ణోగ్రతలు తగ్గుముఖం

తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతున్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జనవరి 8 నుంచి 10 వరకు రాష్ట్ర వ్యాప్తంగా బలమైన చలి గాలులు వీచే అవకాశం Read more

×