పవన్ భద్రతపై విచారణ చేస్తున్నాము : డీజీపీ

డిప్యూటీ సీఎం పవన్ భద్రత అంశాన్ని సీరియస్‌గా విచారణ చేస్తున్నట్లు ఏపీ డీజీపీ తెలిపారు. పవన్ ఇంటిపై డ్రోన్ కెమెరా ఎగిరిన ఘటనపై పోలీస్ శాఖ సీరియస్‌గా దర్యాప్తు చేస్తోందని.. నిన్న సాయంత్రానికి విచారణ పూర్తి కావాల్సి ఉందన్నారు. డ్రోన్‌ ఎగరడంపై పోలీసులు ముఖ్యమైన సమాచారాన్ని సేకరించారని తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ భద్రతపై ప్రతీ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నామన్నారు. ఉపముఖ్యమంత్రి ఇంటిపై డ్రోన్ ఎగురవేయడంపై విచారణ చేస్తామని.. పవన్ ఇంటిపై డ్రోన్ ఎగిరిందా? లేదా? అన్నది నిర్ధారిస్తామని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ ఏజెన్సీ పర్యటనలో భద్రతాపరంగా ఎలాంటి లోపం లేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరనే విషయంపైనా విచారణ జరుగుతుందని డీజీపీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు.

డ్రోన్‌ ఎగరడంపై పోలీసులు ముఖ్యమైన సమాచారాన్ని సేకరించారని తెలిపారు. అయితే ఈరోజు కూడా విచారణ కోసం కొంత సమయం కావాలని పోలీసులు అడిగారని.. నేటి సాయంత్రానికి డ్రోన్ కెమెరా ఎగిరిన అంశానికి సంబంధించి మొత్తం విచారణ పూర్తి అవుతుందని డీజీపీ తెలిపారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్.. పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన సమయంలో ఒక నకిలీ పోలీసు ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై మీడియా ప్రస్తావించగా.. ఈ రెండు అంశాలను వేరేవేరుగా చూస్తున్నామని తెలిపారు. మన్యం జిల్లాలో పవన్ పర్యటనలో ఎటువంటి భద్రతా లోపం లేదని, కేవలం పర్యటన పూర్తి అయిన తర్వాతే నకిలీ పోలీసు వచ్చినట్లు పోలీసులు గుర్తించారని.. దానిపై కూడా విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

Related Posts
ఎంపీ పిఎ రాఘవ రెడ్డి 41 ఏ నోటీసులు జారీ
MP PA Raghava Reddy 41 A no

పులివెందుల : సోషియల్ మీడియాలో అసభ్యకర పోస్టింగ్ ల కేసులో ఎంపీ పిఏ బండి రాఘవ రెడ్డి ఇంటికి పోలీస్ లు వెళ్లి ఈనెల తొమ్మిదవ తేదిన Read more

మైనారిటీల బడ్జెట్ ను ఇతర పథకాలకై దారిమళ్లించ కూడదు
minority

మైనారిటీల బడ్జెట్ ను ఇతర పథకాలకై దారిమళ్లించ కూడదు జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు సయ్యద్ షాహెజాది అమరావతి, డిశంబరు 10: మైనారిటీల బడ్జెట్ ను మైనారిటీల Read more

మంత్రి లోకేష్ కు చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు
chiru lokesh

మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా రాజకీయ నేతలే కాదు ఇతర రంగాల వారు సైతం పెద్ద ఎత్తున లోకేష్ కు పుట్టిన Read more

వంశీ పిటిషన్ పై ముగిసిన వాదనలు.
వంశీ పిటిషన్ పై ముగిసిన వాదనలు.

గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి, అనంతరం ఫిర్యాదుదారుడి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయమై న్యాయపరమైన Read more