పవన్ భద్రతపై విచారణ చేస్తున్నాము : డీజీపీ

డిప్యూటీ సీఎం పవన్ భద్రత అంశాన్ని సీరియస్‌గా విచారణ చేస్తున్నట్లు ఏపీ డీజీపీ తెలిపారు. పవన్ ఇంటిపై డ్రోన్ కెమెరా ఎగిరిన ఘటనపై పోలీస్ శాఖ సీరియస్‌గా దర్యాప్తు చేస్తోందని.. నిన్న సాయంత్రానికి విచారణ పూర్తి కావాల్సి ఉందన్నారు. డ్రోన్‌ ఎగరడంపై పోలీసులు ముఖ్యమైన సమాచారాన్ని సేకరించారని తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రతపై ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ భద్రతపై ప్రతీ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నామన్నారు. ఉపముఖ్యమంత్రి ఇంటిపై డ్రోన్ ఎగురవేయడంపై విచారణ చేస్తామని.. పవన్ ఇంటిపై డ్రోన్ ఎగిరిందా? లేదా? అన్నది నిర్ధారిస్తామని చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ ఏజెన్సీ పర్యటనలో భద్రతాపరంగా ఎలాంటి లోపం లేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ పర్యటన తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరనే విషయంపైనా విచారణ జరుగుతుందని డీజీపీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు.

Advertisements

డ్రోన్‌ ఎగరడంపై పోలీసులు ముఖ్యమైన సమాచారాన్ని సేకరించారని తెలిపారు. అయితే ఈరోజు కూడా విచారణ కోసం కొంత సమయం కావాలని పోలీసులు అడిగారని.. నేటి సాయంత్రానికి డ్రోన్ కెమెరా ఎగిరిన అంశానికి సంబంధించి మొత్తం విచారణ పూర్తి అవుతుందని డీజీపీ తెలిపారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్.. పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన సమయంలో ఒక నకిలీ పోలీసు ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై మీడియా ప్రస్తావించగా.. ఈ రెండు అంశాలను వేరేవేరుగా చూస్తున్నామని తెలిపారు. మన్యం జిల్లాలో పవన్ పర్యటనలో ఎటువంటి భద్రతా లోపం లేదని, కేవలం పర్యటన పూర్తి అయిన తర్వాతే నకిలీ పోలీసు వచ్చినట్లు పోలీసులు గుర్తించారని.. దానిపై కూడా విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

Related Posts
విద్యకు రూ.2,506 కోట్లు.. బడ్జెట్ హైలైట్స్
బడ్జెట్లో భారీగా రాజధాని అమరావతికి కేటాయింపులు

అప్పు తీసుకొనే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ అమరావతి: ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.3.22 లక్షల Read more

Ys Sharmila : సీఎం చంద్రబాబు పై విమర్శలు చేసిన షర్మిల
సీఎం చంద్రబాబు పై విమర్శలు చేసిన షర్మిల

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఇటీవల వైఎస్సార్ జిల్లా పేరును తిరిగి "వైఎస్సార్ కడప జిల్లా గా మార్చింది. అదే సమయంలో కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీ Read more

NTR Vaidya Sevalu : ఈ నెల 7 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్
ntr vaidya seva

ఆంధ్రప్రదేశ్‌లోని నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు ఈ నెల 7వ తేదీ నుంచి నిలిపివేయనున్నట్లు ఏపీ స్పెషాల్టీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ప్రభుత్వానికి ఆసుపత్రుల నుంచి Read more

బడ్జెట్‌లో సూపర్ సిక్స్ కి అధిక ప్రాధాన్యత
Sharmila's anger over AP budget

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3 లక్షల కోట్లు దాటిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ Read more

×