We are determined to make AP clean.. CM Chandrababu

ఏపీని స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పించాం: సీఎం

కందుకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లా కందుకూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కందుకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కందుకూరులో మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్‌ను ప్రారంభించిన సీఎం, దూబగుంటలో గ్రామస్థులతో కలిసి పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..ఏపీని స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పించామని, పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు నెలలో ఒక్కరోజు కేటాయించాలని పిలుపునిచ్చారు.

Advertisements
ఏపీని స్వచ్ఛాంధ్రగా చేయాలని సంకల్పించాం

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది

కందుకూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో స్టాళ్లను పరిశీలించిన సీఎం, స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. వేస్ట్ టు వెల్త్ అనేది తన నినాదమని ముఖ్యమంత్రి అన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, క్రిమిసంహారక మందులు వాడిన ఆహారం తినాల్సి వస్తుందని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రజలతో సీఎం చంద్రబాబు ప్రతిజ్ఞ చేయించారు.

చెత్తను పునర్వినియోగం చేసేందుకు కృషి

పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ పని చేయాలని పిలుపునిచ్చారు. గంజాయి ఉత్పత్తి చేస్తే ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. పట్టణాల్లో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని, అక్టోబర్ 2 నాటికి చెత్త తొలగించే బాధ్యతను మున్సిపల్‌శాఖకు అప్పగించామని గుర్తు చేశారు. చెత్తను పునర్వినియోగం చేసేందుకు కృషి చేస్తున్నామన్న చంద్రబాబు, చెత్త నుంచి సంపద సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంపునకు యత్నిస్తున్నామని చెప్పారు.

Related Posts
ఈనెల 30 నుండి బీఆర్‌ఎస్‌ “గురుకుల బాట” కార్యక్రమం: కేటీఆర్‌
Will march across the state. KTR key announcement

హైదరాబాద్‌ : గురుకులాల్లో చోటు చేసుకుంటున్న వరుస విషాద ఘటనల నేపథ్యంలో ఈనెల 30 నుండి డిసెంబర్‌ ఏడో తేదీ వరకు బీఆర్ఎస్‌ పార్టీ తరపున "గురుకుల Read more

హైడ్రా కూల్చివేతలపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
telangana new highcourt wil jpg

ts-high-court హైదరాబాద్‌: హైడ్రా కూల్చివేతలపై రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్‌లోని చెరువులు, నాలాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే.అయితే, Read more

రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్
Sant Sevalal Maharaj Jayant

సేవాలాల్ మహారాజ్ జయంతి తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 15న ప్రత్యేక సెలవు ప్రకటించింది. గిరిజన ఉద్యోగులకు ఈరోజు Read more

కవిత వల్లే ఢిల్లీలో ఆప్ ఓటమి – కొండా సురేఖ
నేష‌న‌ల్ బ‌యోడైవ‌ర్స‌టీ కాన్ఫ‌రెన్స్

తెలంగాణ మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ (BRS) పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఓటమికి కారణం కల్వకుంట్ల కవిత Read more

×