ఉదయాన్నే గోరువెచ్చని బెల్లం నీరు తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.బెల్లంలో అనేక రకాల పోషకాలు ఉండటంతో, ఇది ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సహజ టానిక్‌గా పనిచేస్తుంది. చక్కెరతో పోల్చితే బెల్లం ఉపయోగాలు చాలా ఎక్కువ. పరగడుపున బెల్లం నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి, శరీరంలో అనేక సమస్యలు తగ్గుతాయి.
బెల్లం నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
జీర్ణక్రియను మెరుగుపరిచే గుణం
ఉదయాన్నే గోరువెచ్చని బెల్లం నీరు తాగడం జీర్ణక్రియను మెరుగుపరిచే శక్తివంతమైన మార్గంగా చెప్పుకోవచ్చు. ఇది మలబద్ధకాన్ని తగ్గించి, కడుపులో మంట, ఎసిడిటీ, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.బెల్లం సహజ డిటాక్సిఫయర్‌గా పనిచేస్తుంది. ఇందులో ఉన్న పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు శరీరంలోని విషతత్వాలను బయటకు పంపిస్తాయి. లివర్ పనితీరును మెరుగుపరిచి హానికరమైన టాక్సిన్స్‌ను తొలగిస్తుంది.
హిమోగ్లోబిన్
బెల్లంలో ఎక్కువ మొత్తంలో ఐరన్ ఉండటం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఇది ప్రత్యేకంగా రక్తహీనతతో బాధపడే వారికి చాలా మంచిది.
రక్తపోటును నియంత్రిస్తుంది
హై బీపీతో బాధపడేవారు రోజూ ఉదయాన్నే బెల్లం నీరు తాగితే ఇది రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

బరువు తగ్గించడంలో సహాయపడుతుంది
బెల్లం నీరు జీవక్రియను క్రమబద్ధీకరించి కొవ్వును వేగంగా కరిగిస్తుంది. అలాగే, ఆకలిని అదుపులో ఉంచే గుణం కూడా ఇందులో ఉంది.
గొంతు సమస్యలకు పరిష్కారం
బెల్లంలోని వెచ్చని లక్షణాలు గొంతుకు ఉపశమనం కల్పిస్తాయి. దగ్గు, కంజెషన్,ఉబ్బసం, బ్రోన్కైటిస్ నుంచి ఉపశమనం కలుగుతుంది. బెల్లం నీరు జీవక్రియను క్రమబద్ధీకరిస్తుంది. ఆకలిని తగ్గించి బరువు నిర్వహణలో తోడ్పడుతుంది. లివర్ నుండి హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది.
చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది
బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. ఇది మొటిమలు, చర్మ మురికిని తొలగించడంలో సహాయపడుతుంది.
రుతుస్రావ సమస్యల నుంచి ఉపశమనం
బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది మూడ్ స్వింగ్స్, గర్భాశయ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
బెల్లం నీరు తయారీ విధానం
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తీసుకోవాలి.ఒక చిన్న ముక్క బెల్లాన్ని అందులో వేసి పూర్తిగా కరిగే వరకు కలపాలి.ఈ నీటిని పరగడుపున తాగితే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
ఎప్పుడు తాగాలి?
ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే ఉత్తమ ఫలితాలు అందుకుంటారు.భోజనం తర్వాత తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.ఈ విధంగా ప్రతిరోజూ బెల్లం నీరు తాగడం ద్వారా శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించుకోవచ్చు.