Walkout of BRS members from Legislative Assembly

శాసన సభ నుంచి బీఆర్‌ఎస్‌ సభ్యుల వాకౌట్‌

హైదరాబాద్‌: శాసన సభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వాకౌట్‌ చేశారు. ఫార్ములా ఈ రేసుపై చర్చ జరపాలని బీఆర్‌ఎస్‌ సభ్యులు అసెంబ్లీలో పట్టుబట్టారు. కానీ ప్రభుత్వం దానికి అనుమతించకపోవడంతో వారు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఫార్ములా ఈ కార్‌ రేసింగ్‌ అంశం మీద అసెంబ్లీలో చర్చ జరపాలని బీఆర్‌ఎస్‌ సభ్యులు ఈరోజు పట్టుబట్టారు.

Advertisements

ప్రపంచస్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను పెంచే లక్ష్యంతో హైదరాబాద్‌ నగరానికి ఫార్ములా ఈ కారు రేసింగ్‌ను కేటీఆర్‌ తీసుకొస్తే.. ఆయనపై అక్రమ కేసులు పెట్టడంపై బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఈ అంశంపై చర్చకు పెడితేనే నిజానిజాలు ప్రజలకు తెలుస్తాయని పేర్కొన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా ఈ కారు రేసింగ్‌పై చర్చకు అనుమతించకపోవడంతో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే సభ నుంచి వాకౌట్‌ చేశారు.

కాగా, కేటీఆర్‌ను అప్రతిష్టపాలు చేసి బీఆర్‌ఎస్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించారు. అసెంబ్లీ నడిచే సమయంలో ఒక ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారని చెప్పారు. ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ అంశంలో స్పీకర్‌ చాంబర్‌లో కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. ఫార్ములా-ఈ కార్‌ రేస్‌ అంశంలో రకరకాల లీకులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు ఫార్ములా-ఈ రేస్‌ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Related Posts
Myanmar: మయన్మార్‌లో భారీ భూకంపం: ప్రజలు రోడ్లపైకి పరుగులు
మయన్మార్‌లో భారీ భూకంపం: ప్రజలు రోడ్లపైకి పరుగులు

భూకంపం తీవ్రత 7.2మయన్మార్‌లో ఈ రోజు సంభవించిన భూకంపం, రిక్టర్ స్కేల్‌పై 7.2 తీవ్రతను నమోదు చేసింది. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకటన ప్రకారం, ఈ Read more

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
Cabinet meeting concludes.. Approval of several key issues

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపిన Read more

MLC Poll : HYD స్థానిక ఎమ్మెల్సీ కౌంటింగ్ నేడే
MLC poll counting

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మంగళవారం జరిగిన పోలింగ్‌లో మొత్తం 112 ఓటర్లలో 88 Read more

హోళీ అంటే అర్థం ఏమిటి? ..ఎందుకు చేసుకుంటోరో తెలుసా..?
What does Holi mean? ..Do you know why it is celebrated..?

హైదరాబాద్‌: హోళీ అంటే సర్వం రంగుల మయం. చిన్నపెద్దా అందరిలో ఆనందం. ఉత్సాహంగా… ఉల్లాసంగా.. చిన్నపెద్దా, కులం, పేద, ధనిక ఇలా ఏ బేధం లేకుండా ఆనందోత్సవాలతో Read more

×