వృశ్చిక రాశి

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి

19-03-2026  |  గురువారం
ఆదాయం 11
వ్యయం 05
రాజపూజ్యం 02
అవమానం 06

వృశ్చికరాశి వారికి ఈ సంవత్సరం అష్టమం, భాగ్యం, దశమంలో గురువు, చతుర్ధం, తృతీయంలో రాహువు, పంచమంలో శనీశ్వరుడు, దశమ, భాగ్యంలో కేతువు, గ్రహ సంచారం గలదు. శని గ్రహ స్థానాన్ని, గురుగ్రహ స్థానాన్ని, పరిశీలించుకుని తగిన శాంతి క్రతువులు జరిపించండి. సత్ఫలితాలు పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు అంగారక పాశుపత హెూమం జరిపించండి. చేతికి పాశుపత కంకణం ధరించండి. ఈ రాశి వారు స్నేహితుల ద్వారా సహోద్యోగుల ద్వారా విలువైన సమాచారాన్ని అందుకోగలుగుతారు. వాళ్ళ సహాయ సహకారాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. పరోక్షంగా ఆర్థిక అభివృద్ధికి కారణమవుతుంది.

గృహ నిర్మాణం అంశాలు నిదానంగా నెరవేరుతాయి. మీరు అనుకున్న స్థాయిలో అవి వేగంగా పూర్తి కాకపోవచ్చు దీని ద్వారా స్వల్పమైనటువంటి ధన నష్టము కలిగి అవకాశం ఉంటుంది. ఉన్నత స్థానంలో ఉన్న స్నేహితులు అధికారులు మీకు సరైన సమయానికి అక్కడికి రాకపోవచ్చు. వాళ్ళు ఉన్నారని నమ్మి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకొని బంగపడే అవకాశం ఉంటుంది. వాళ్ళని నమ్ముకునే కన్నా మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ దగ్గర ఉన్న ధనాన్ని నమ్ముకుని ప్రయత్నం చేయగలిగితే అన్ని విధాలా మంచిది. కొంతమంది వ్యక్తుల మీద మీకు వున్న అభిప్రాయము తారుమారవుతుంది. ఎంతో మంచి వ్యక్తి సహకరిస్తారు. మనకి మేలును చేస్తారు అని అనుకున్న వ్యక్తి ఇతరులతో స్నేహభావంగా ఉండి మీకు అన్యాయం చేస్తున్నట్టుగా కొంతకాలానికి తెలిసి వస్తుంది. ఈ కారణం చేత ఎవరిని ఇష్టపడకూడదు ఎవరిని నమ్మకూడదు అన్నట్టుగా మీరు కృంగిపోతారు.

ఇంటికి కొన్ని కొత్త పరికరాలను కొనుగోలు చేస్తారు. మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. అయిన వాళ్ళ రూపంలో శత్రువులు ఉన్నందువలన తల్లి ప్రేమ కొన్నాళ్లు కరువు అవుతుంది. ప్రయాణాలు చిన్న పొన్న ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వెళ్లిన ప్రతి పనిలోనూ స్వల్పమైన ఆటంకాలు ఏర్పడటం మళ్ళీ పునర్ ప్రయాణాలు కావటము అప్పుడు పనులు పూర్తి కావటం ఈ విధమైన పరిణామాలు ఏర్పడతాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి మంచి ప్రజాదరణ పొందగలుగుతారు. గురుస్థానంలో ఉండి మీకు సలహాలు సూచనలు ఇచ్చే వారి ద్వారా మంచి పేరుని ప్రఖ్యాతిని సాధిస్తారు. మీరు తీసుకునే సొంత నిర్ణయాలు కన్నా పెద్దలు ఇచ్చే సలహాలు మేరకు మీరు నడుచుకోగలిగితే బాగుంటుంది.

ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కొంతకాలం గడిచిన తర్వాత క్రమక్రమంగా ఆలోచనలలో మార్పులు రావటం ప్రవర్తనలలో మార్పులు రావటం ఆశ్చర్యం కలిగించే అంశంగా మారుతుంది పెళ్లి చేసుకుంటామని తిరిగి చివరికి పెళ్లి ఊసు ఎత్తగానే ఏదో నెత్తి మీద పిడుగు పడ్డట్టుగా మారిపోవడం మీకు ఆశ్చర్యాన్ని బాధని కలిగిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు కొన్ని మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఇంటికి సంబంధించిన కొన్ని విషయాలలో ఇబ్బందులు ఏర్పడినప్పటికీ నిదానంగా ఇద్దరు కలిసి తీసుకునే నిర్ణయాల వలన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. వ్యవసాయ వృత్తిలో ఉన్న వారికి బాగుంటుంది. పంటలు తోటలు అనుకూలంగా ఉంటాయి. పెట్టిన పెట్టుబడులకు తగిన ఆదాయాన్ని పొందగలుగుతారు.

క్రీడారంగాన్లో ప్రవేశించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. తమ సంతానము క్రీడల్లో పాల్గొనాలి. ఏదైనా నేర్చుకోవాలి అన్న కోరిక నెరవేరుతుంది. రుణాలకు సంబంధించిన అంశాలలో కాస్తంత ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తున్నది. ఒకానొక నెల చెల్లింపులు చెల్లించలేక అవస్థల గురి అయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి. అన్ని వైపుల నుంచి సమస్యలు తరుముకొస్తున్నట్టుగా కనిపిస్తుంది. కొంతమంది పెద్దవాళ్ళకి ఇంట్లో వసతులు సరిగా లేవని ఆరోపించడం అనేది జరుగుతుంది. వాళ్లు కోరే గొంతెమ్మ కోరికలను తీర్చడానికి మీ దగ్గర శక్తిలేదని బాధపడాలో అయిన వాళ్ళు అయ్యుండి పరిస్థితులను అర్థం చేసుకోకుండా కావాలనే జీవితాన్ని అప్రశాంతంగా మారుస్తున్నందుకు బాధపడాలో అర్థం కాదు. స్నేహితులతో కలిసి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కొంతమంది వ్యక్తులతో గొడవపడాలన్న ఆలోచనలు మీకు ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ వాళ్లకి మాత్రం మీ మీద మంచి అభిప్రాయం ఉంటుంది. కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రజాదరణ పొందే అవకాశాలు లభిస్తాయి. పారితోషకం మాత్రం మీరు ఊహించిన స్థాయిలో ఉండకపోవచ్చు. సహోదర సహోదరీ వర్గంతో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి.

ఈరోజు ఫలితాలు

ఆరోగ్యం 60%
సంపద 80%
కుటుంబం 60%
ప్రేమ సంభందిత విషయాలు 40%
వృత్తి 80%
వైవాహిక జీవితం 60%
Sun

వారం - వర్జ్యం

తేది : 19-03-2026, గురువారం
శ్రీ పరాభవ నామ సంవత్సరం , చైత్రమాసం , ఉత్తరాయణం వసంత ఋతువు , శుక్లపక్షం ఉత్తరాభాద్ర కార్తె
అమావాస్య ఉ.6.53 , సా. పాడ్యమి తె.4.51 , ఉత్తరాభాద్ర తె.4.03
వర్జ్యం: మ.2.26-3.52
రాహుకాలం: మ.1.30 - 3.00

మీకు నచ్చవచ్చు