వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు ఇది శుభవార్తే. కొన్నేళ్లుగా 5G సేవలపై ఎదురుచూస్తున్న Vi వినియోగదారులకు నిన్నటి నుంచి 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ప్రస్తుతం ఈ సేవలు ముంబై నగరానికి మాత్రమే పరిమితం కాగా, వచ్చే నెలలో ఢిల్లీ, బెంగళూరు, చండీగఢ్, పాట్నా, మైసూర్ నగరాలకు కూడా విస్తరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. సంస్థ ప్రణాళిక ప్రకారం, మూడు సంవత్సరాల లోపు 100 నగరాలకు 5G సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

Vodafone Idea 5G సేవల ప్రధానాంశాలు:
ముంబై నగరంలో ప్రారంభం ,రెండో దశలో ఢిల్లీ, బెంగళూరు, చండీగఢ్, పాట్నా, మైసూర్ ,మూడేళ్లలో 100 నగరాలకు విస్తరణ ప్రణాళిక , 5G సేవలు ప్రస్తుతానికి రూ. 299 అపరిమిత యాడ్-ఆన్ ప్లాన్ కింద లభ్యం, మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, చెన్నై తదితర నగరాల్లో త్వరలో అందుబాటులోకి ,ఫైబర్, సెల్ టవర్స్ లేని ప్రాంతాల్లో శాటిలైట్ సేవలపై పరిశీలన Vi చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్ సింగ్ ప్రకారం, మొదటి విడతగా ముంబైలో 5G సేవలను ప్రారంభించి, దశల వారీగా 17 సర్కిళ్లలోని 100 ప్రధాన నగరాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. మొదటి విడత విస్తరణ అనంతరం మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, చెన్నై తదితర నగరాలకు 5G సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. అంతేకాదు, ఫైబర్ కేబుళ్లు, సెల్ టవర్లు లేని ప్రాంతాల్లో 5G సేవలు అందించేందుకు శాటిలైట్ సాంకేతికతపై కొన్ని సంస్థలతో చర్చలు జరుపుతున్నామని Vi ప్రతినిధులు వెల్లడించారు. అంటే, భౌగోళిక పరిమితుల వల్ల ఇప్పటి వరకు ఇంటర్నెట్ సేవలు సరిగ్గా అందని ప్రాంతాల్లో కూడా 5G విస్తరణకు మార్గం సుగమం కానుంది. Jio, Airtel లాంటి నెట్‌వర్క్ కంపెనీలు ఇప్పటికే దేశవ్యాప్తంగా 5G సేవలను అందుబాటులోకి తెచ్చాయి. అయితే, Vi మిగిలిన పోటీదారుల కంటే ఆలస్యంగా 5G ప్రవేశపెట్టడం ప్రధానమైన మార్పుగా చెప్పుకోవచ్చు.