హైదరాబాద్: సింగరేణి సంస్థకు సంబంధించి డిఎంఎఫ్టి నిధులను సింగరేణి (Singareni) ప్రాంతాల్లోనే ఖర్చు చేసేలా త్వరలో చట్టం తీసుకొస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) అన్నారు. ఆదివారం మంచిర్యాల జిల్లా మంచమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో పర్యటించారు. వరుసగా గనులు మూత పడటంతో ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయన్న మంత్రి కొత్త బొగ్గు గనులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విధుల్లో ్యంగా వ్యవ హరిస్తున్న అధికారులు, ఆగ్రహం వ్యక్తం చేశారు.

5 వేల కొత్త ఉద్యోగాలు
ఈ మాట్లాడుతూ జైవర్లో 850 నిరక్ష సిబ్బంది పై సందర్భంగా మెగావాట్ల మూడో యూనిట్కు త్వరలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భూమి పూజ చేస్తారని తెలిపారు. ఈ ప్లాంట్ ద్వారా 5 వేల కొత్త ఉద్యోగాలు వస్తాయన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత రాష్ట్రంలో మొదటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను (Skill Development Center) మందమర్రిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కోర్టు తీర్పు ఆధారంగా మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిపిస్తా మన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ కెటగిరీ పరిశ్రమ ల్లోని కీలక విభాగాల్లో శిక్షణ పొందిన కార్మికులను నియమించేలా చర్యలు తీసుకుంటామని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy) తెలిపారు. ఈ విషయమై ఇప్పటికీ కార్మిక శాఖ కార్యదర్శిని ఆదేశించినట్లు చెప్పిన మంత్రి త్వరలోనే దీనిపై చట్టం కూడా తీసుకొస్తామన్నారు. పాశమైలారం ఫ్యాక్టరీలో కీలక విభాగాల్లో శిక్షణ పొందిన కార్మి కులను నియమించలేదని గుర్తించామన్నారు .
మంత్రి వివేక్ వెంకటస్వామి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం?
వివేక్ వెంకటస్వామి గారు 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల జిల్లా లోని చెన్నూర్ నియోజకవర్గం నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ప్రస్తుతం ఆయన విసాకా ఇండస్ట్రీస్ సంస్థ వైస్ చైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: Electricity: రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థపై పెనుభారంగా విద్యుత్ డిస్కంలు