Visited the family members of the murdered student YCP MP YS Avinash Reddy

మాటల్లో చెప్పలేని అమానుషం ఇది : ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

అమరావతి: కడప జిల్లా బద్వేల్‌లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను వైసీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి పరామర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డిలు కూడా బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఆడ పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు బాధపడుతున్నారు.. మాటల్లో చెప్పలేని అమానుషం ఇది.. 2021లో ఇలాంటి సంఘటన గుంటూరులో జరిగినప్పుడు కొద్ది రోజుల్లోనే కన్విక్ట్ చేశామని గుర్తుచేశారు. ఈ నాలుగు మాసాల్లో 74 సంఘటనలు జరిగాయి. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా..? అని మండిపడ్డారు. హోం మంత్రి అన్నీ చోట్ల సెక్యూరిటీ ఇవ్వలేం కదా అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

ఈ విద్యార్థిని 10వ తరగతిలో స్కూల్ ఫస్ట్.. అలాంటి పాప చనిపోవడం బాధాకరం అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొవాలి.. దిశా చట్టం, యాప్ అమలు చేసి ఉంటే పది నిమిషాల్లో స్పాట్ కి వెళ్ళేవారు.. ఈ ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది.. మహిళల రక్షణ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించింది.. సమాజం భయపడేలా కఠిన శిక్ష ఉండాలని ఆ తల్లి కోరుతోందని తెలిపారు.

Related Posts
జోగి రమేశ్ తో పరిచయం లేదు: కొనకళ్ల నారాయణ
naryana

మాజీ మంత్రి జోగి రమేశ్ ను ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కలవడం టీడీపీ శ్రేణుల్లో కలకలం రేపింది. ఏలూరు జిల్లా నూజివీడులో సర్దార్ గౌతు లచ్చన్న Read more

తెలుగు రాష్ట్రాలకు నిధులు రిలీజ్ చేసిన కేంద్రం
telugu states

ఐదు రాష్ట్రాలకు మొత్తంగా రూ.1,554.99 కోట్లు విడుదల కేంద్ర ప్రభుత్వం విపత్తు సహాయ నిధుల కింద ఐదు రాష్ట్రాలకు మొత్తంగా రూ.1,554.99 కోట్లు విడుదల చేసింది. ఈ Read more

దేశంలో సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు
Chandrababu Naidu is the richest Chief Minister in the country

న్యూఢిల్లీ: దేశంలోనే ధనిక సీఎంగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలిచారు. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ చివరి స్థానంలో నిలిచారు. అసోసియేషన్‌ Read more

శంషాబాద్ ఎయిర్పోర్టుకు అవార్డు
shamshabad airport

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్ ఎయిర్‌పోర్టు) మరోసారి ప్రపంచవ్యాప్తంగా తన ప్రతిభను చాటుకుంది. ఎయిర్‌పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నిర్వహించిన సర్వీస్ క్వాలిటీ సర్వేలో, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *