Vishnu Priya approaches the High Court!

Betting Apps Case : హైకోర్టును ఆశ్రయించిన విష్ణు ప్రియ !

Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో యాంకర్ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. బెట్టింగ్ యాప్స్ కేసులో తనపై నమోదైన రెండు ఎఫ్ఐఆర్‌లను క్వాష్ చేయాలంటూ యాంకర్ విష్ణుప్రియ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు నేడు (మంగళవారం) నాడు విచారణ జరపనుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్‌ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే ఈ వివాదంలో దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీల పేర్లు తెర మీదకు వచ్చాయి.

హైకోర్టును ఆశ్రయించిన విష్ణు ప్రియ

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు

వారితో పాటు పలువురు నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిలో భాగంగానే యాంకర్ విష్ణుప్రియతో పాటు పలువురు సెలబ్రిటీల మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విష్ణుప్రియ ఆమె సోషల్ మీడియా ఖాతాల్లో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసేవిధంగా విపరీతంగా పోస్టింగ్‌లు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం పోలీసులు ఆమెను విచారించారు.

బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కోసం భారీ ఎత్తున డబ్బు

విష్ణుప్రియ మొబైల్ కూడా సీజ్ చేశారు. విచారణలో భాగంగా విష్ణుప్రియ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కోసం భారీ ఎత్తున డబ్బు తీసుకున్నట్లు అంగీకరించారు. మొత్తం 15 బెట్టింగ్ యాప్‌లను ఆమె ప్రమోట్ చేశారు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ యాప్స్‌ను ప్రమోట్ చేసినట్లు అంగీకరించారు. ఈ క్రమంలో పోలీసులు విష్ణుప్రియ బ్యాంకు స్టేట్మెంట్‌ను కూడా తీసుకున్నారు. ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలని పంజాగుట్ట పోలీసులు విష్ణుప్రియను ఆదేశించారు.

Related Posts
సోషల్ మీడియా లో రాశీ , కియారా , ఆండ్రియా అందాలు సండే ట్రీట్
rka

సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీల ఫోటోలు వైరల్ అవడం కామన్ విషయమే. ఈ మధ్యకాలంలో రాశీ ఖన్నా, కియారా అద్వానీ, ఆండ్రియా జెరెమియా షేర్ చేసిన Read more

ఒకేరోజు పవన్, ప్రభాస్ సినిమాల షూటింగ్లో పాల్గొన్న ముంబై బ్యూటీ
nidhi agarwal

ముంబైకి చెందిన అందమైన నటి నిధి అగర్వాల్ ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది ఆమెకు ప్రస్తుతం రెండు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బిగ్ Read more

నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ap assembly sessions

నేటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుండి ప్రారంభం అవుతున్నాయి. చాలా కాలం తరువాత, ఈ సమావేశాలు రసవత్తరంగా సాగే అవకాశం Read more

పొగమంచు ఎఫెక్ట్‌.. పలు విమానాలు ఆలస్యం
Fog effect.. Many flights are delayed

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, బీహార్‌ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దీంతో చలి తీవ్రతకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *