Vishnu Manchu శివ బాలాజీ, మధుమిత నటించిన ‘గోదారికే సోగ్గాన్నే’ గీతం విడుదల

Vishnu Manchu : శివ బాలాజీ, మధుమిత నటించిన ‘గోదారికే సోగ్గాన్నే’ గీతం విడుదల

Vishnu Manchu : శివ బాలాజీ, మధుమిత నటించిన ‘గోదారికే సోగ్గాన్నే’ గీతం విడుదల మంచు విష్ణు ప్రొడక్షన్ హౌస్ అవా మ్యూజిక్ బ్యానర్‌పై విడుదలైన జానపద గీతం ‘గోదారికే సోగ్గాన్నే’ ఎంతో మంచి స్పందనను అందుకుంటోంది. ఈ మ్యూజికల్ ఆల్బమ్‌లో రియల్ లైఫ్ కపుల్ శివ బాలాజీ, మధుమిత ప్రధాన పాత్రల్లో నటించారు. రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ పాటను ప్రత్యేకంగా విడుదల చేశారు.ఈ సందర్భంగా శివ బాలాజీ, మధుమిత మీడియాతో తమ అనుభవాలను పంచుకున్నారు.శివ బాలాజీ మాట్లాడుతూ.”ఈ పాట మొత్తం 8 నిమిషాల కంటెంట్‌ను కలిగి ఉంటుంది. ఇందులో కథను పూర్తిగా పాట ద్వారా చెప్పేలా మ్యూజికల్ నేరేషన్ గా రూపొందించాం.మొదట్లో మేము ఇందులో నటించబోమని అనుకున్నాం. కాన్సెప్ట్ విన్న తర్వాత మధుమిత కూడా ప్రాజెక్ట్‌లో చేరింది.మా నటన పూర్తిగా సింగిల్ టేక్‌లో చేయాల్సి వచ్చింది. సెట్స్ మీద చాలా ఇంప్రోవైజ్ చేశాం.

Vishnu Manchu శివ బాలాజీ, మధుమిత నటించిన ‘గోదారికే సోగ్గాన్నే’ గీతం విడుదల
Vishnu Manchu శివ బాలాజీ, మధుమిత నటించిన ‘గోదారికే సోగ్గాన్నే’ గీతం విడుదల

పాటలో రెండు వేరియేషన్స్ ఉన్న క్లైమాక్స్ ప్లాన్ చేశాం.పాట అద్భుతంగా వచ్చింది.ప్రతి ఒక్కరికీ నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం” అని తెలిపారు.ఈ సందర్భంగా మధుమిత మాట్లాడుతూ “సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్ టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మ్యూజికల్ ఆల్బమ్‌లను రూపొందిస్తున్నాం. ఈ పాట కాన్సెప్ట్ నాకు చెబుతుంటేనే ఎంతో ఆసక్తిగా అనిపించింది.

మేము రియల్ లైఫ్ కపుల్ కావడంతో మళ్లీ తెరపై జంటగా కనిపించడం ఎంతో ఆనందంగా ఉంది.గోదావరి యాసలో మాట్లాడటం మాకు కొత్త అనుభూతి ఇచ్చింది.పాట వినసొంపుగా ఉండడంతో పాటు అందరికీ చేరువయ్యేలా ఉంటుంది” అని వివరించారు.అవా ఎంటర్టైన్మెంట్ సీఈఓ చిదంబరం మాట్లాడుతూ “మంచు మోహన్ బాబు గారు, విష్ణు గారు యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు అవా మ్యూజిక్‌ను ప్రారంభించారు.రాబోయే రోజుల్లో మా సంస్థ నుంచి మరిన్ని గొప్ప ప్రాజెక్టులు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మేము ప్రొడ్యూస్ చేసిన ఈ పాటకు విశేష స్పందన రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ పాటలో నటించిన శివ బాలాజీ, మధుమితలకు మా ప్రత్యేక కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.‘గోదారికే సోగ్గాన్నే’ పాటను ఇప్పటికే సినీ ప్రేమికులు, సంగీతాభిమానులు విశేషంగా ఆదరిస్తున్నారు. ఈ మ్యూజికల్ ప్రాజెక్ట్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Related Posts
అదే యానిమల్‌ పార్క్‌ లక్ష్యం
animal movie

రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.900 కోట్లు Read more

రాజకీయాల గురించి మాట్లాడను: మంచు మనోజ్
manchu

మంచు మనోజ్ జనసేన పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. నిన్న ఆళ్లగడ్డకు వచ్చిన ఆయన దీనిపై మీడియాతో మాట్లాడారు. పొలిటికల్ ఎంట్రీపై మీడియా మనోజ్‌ను Read more

Anushka : సడెన్‌గా ఇలా షాకి చ్చావేంటి అనుష్క
anushka shetty first malayalam movie kathanar 99372987

స్టార్ హీరోయిన్ అనుష్క గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఆమె సినీ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సూపర్ స్టార్ నాగార్జునతో కలిసి నటించిన సూపర్ సినిమాతో Read more

పవర్ఫుల్ గా బాలయ్య 109 టైటిల్ టీజర్
NBK 109 glimpse 2

ఈ ఏడాదిలో నందమూరి అభిమానులకు పెద్ద ఉత్సాహాన్ని అందించిన చిత్రం “దేవర,” యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో వచ్చింది. అయితే, ఇదే కాదు—నందమూరి నటసింహం బాలకృష్ణ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *