విశాఖపట్నం (Vizag) నుంచి నేరుగా అబుదాబి(Abu Dhabi)కి ప్రయాణించాలనుకునే ప్రయాణికుల కోసం శుభవార్త. జూన్ 13వ తేదీ నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్ (Indigo Airlines) నూతన అంతర్జాతీయ విమాన సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఈ సర్వీస్ ప్రారంభం ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లే ప్రయాణికులకు ఎంతో సౌకర్యం కలగనుంది. ఇప్పటికే విశాఖ నుంచి దుబాయ్, సింగపూర్‌లకు విమాన సర్వీసులు అందుబాటులో ఉండగా, ఇప్పుడు అబుదాబికి కూడా నేరుగా వెళ్లే అవకాశం ఏర్పడింది.
వారానికి నాలుగు రోజులు సేవలు
ఈ నూతన విమాన సర్వీస్ వారానికి నాలుగు రోజులు .. సోమవారం, బుధవారం, శుక్రవారం, ఆదివారం — అందుబాటులో ఉంటుంది. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఉదయం 9:45 గంటలకు విమానం బయలుదేరి మధ్యాహ్నం 12:35 గంటలకు అబుదాబికి చేరుకుంటుంది. అదే విమానం అక్కడి నుంచి మధ్యాహ్నం 2:35కు బయలుదేరి సాయంత్రం 4:00 గంటలకు విశాఖకు తిరిగి వస్తుంది. ఈ షెడ్యూల్ వ్యాపార ప్రయాణికులు, ఉద్యోగులు, పర్యాటకులకు అనుకూలంగా ఉండేలా రూపొందించబడింది.
అంతర్జాతీయ కనెక్షన్లకు మరింత వేగం
విశాఖపట్నం నుంచి అబుదాబికి నేరుగా విమాన సర్వీస్ ప్రారంభమవడం ద్వారా అంతర్జాతీయ ప్రయాణ సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. రాష్ట్రానికి పెట్టుబడులు, వ్యాపార అవకాశాలు పెరగటంతో పాటు, ప్రవాసాంధ్రులకు ఇదొక పెద్ద ఊరటగా నిలవనుంది. విమాన సర్వీసుల పెంపుతో విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం మరింత ఆవిర్భవించనుంది.
Read Also : Honeymoon Couple : హనీమూన్ మర్డర్ కేసు పై మేఘాలయ సీఎం ఆగ్రహం