విరాట్ కోహ్లీ పేరు చెప్పగానే గుర్తొచ్చేది క్లాస్ బ్యాటింగ్ ఇప్పుడు అతడు ఐపీఎల్‌లో అరుదైన మైలురాయికి దగ్గరగా ఉన్నాడు.మరి రెండు బౌండరీలు కొడితే, ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు రాస్తాడుఇప్పటి వరకు విరాట్ 265 మ్యాచ్‌లు ఆడాడు.అందులో 720 ఫోర్లు, 278 సిక్సర్లు ఉన్నాయి.అంటే మొత్తం 998 బౌండరీలు. ఇంకొన్ని నిమిషాల్లో 1,000 మార్క్‌ను చేరే అవకాశముంది.ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ ఉంది.ఈ మ్యాచ్లోనే కోహ్లీ ఘనత సాధిస్తాడా? అన్నది అభిమానుల్లో ఆసక్తిగా మారింది.బౌండరీల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు.ఆయన తర్వాత శిఖర్ ధవన్ 920 బౌండరీలతో ఉన్నాడు. వార్నర్‌కు 899, రోహిత్ శర్మకు 885 బౌండరీలు ఉన్నాయి. క్రిస్ గేల్ అయితే 761తో వెనుకబడ్డాడు. అయితే వీరందరినీ వెనక్కి నెట్టిన ఆటగాడు కోహ్లీ మాత్రమే.ఈ సీజన్‌లో విరాట్ ఫార్మ్ అదిరిపోయింది.ఇప్పటివరకు 4 మ్యాచులు ఆడి 164 పరుగులు చేశాడు.అతడి సగటు 54.66 కాగా, స్ట్రైక్ రేట్ 143.85.

ఇది చూస్తే ఈ సీజన్‌లోనూ కోహ్లీ వెలుగు మెరుస్తున్నాడు ఇందులో రెండు హాఫ్ సెంచరీలు వచ్చాయి.స్టైలిష్ షాట్లు, క్లాస్ టెంపరమెంట్‌తో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తున్నాడు ఒక్క మ్యాచ్‌లోనైనా ఆయన ఆడితే స్టేడియం ఊపేస్తుంది.ఈ రోజు మ్యాచ్‌లో రెండు ఫోర్లు పడితే చాలు. వెయ్యి బౌండరీలు క్లియర్. ఐపీఎల్ చరిత్రలో ఇది గొప్ప ఘనత.ఇప్పటిదాకా ఎవరూ ఈ మార్క్ చేరలేదు.ఓ రికార్డు అవుతుంది అనుకునే ముందు.కోహ్లీ జోడించబోయే రెండు ఫోర్లు చూడాల్సిందే.ఆ రెండు షాట్లు ఐపీఎల్‌లో చరిత్ర అవుతాయి.బౌండరీల రాజుగా కోహ్లీ మరోసారి నిలవబోతున్నాడు. అభిమానులు ఇప్పటికే కళ్లతిప్పకుండా ఎదురుచూస్తున్నారు. మరోసారి కోహ్లీ మ్యాజిక్ తేలిపోయేది ఈ సాయంత్రం.ఒకసారి వెయ్యి బౌండరీలు బాదితే,ఆ ఘనత చాలా మందికీ సాధ్యం కాదన్న విషయం స్పష్టమవుతుంది. నేడు విరాట్ చరిత్రలో నిలిచే రోజు కావొచ్చు!