Virat Kohli కోహ్లీ 7 పరుగులకే అవుట్

Virat Kohli : కోహ్లీ 7 పరుగులకే అవుట్

ఐపీఎల్ లో రసవత్తర పోరు కొనసాగుతోంది ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మరియు గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎంచుకుంది.దాంతో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (7) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు.మరో ఓపెనర్ విల్ జాక్స్ 14, దేవదత్ పడిక్కల్ 4 పరుగులకే అవుట్ కావడంతో బెంగళూరు జట్టు 35 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది.గుజరాత్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తన పదునైన బౌలింగ్‌తో ఆర్సీబీ టాపార్డర్‌ను కుదేలేశాడు.కాసేపటికే కెప్టెన్ రజత్ పటిదార్ (12) కూడా పెవిలియన్ చేరాడు.

Advertisements
Virat Kohli కోహ్లీ 7 పరుగులకే అవుట్
Virat Kohli కోహ్లీ 7 పరుగులకే అవుట్

అయితే లియామ్ లివింగ్‌స్టన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జితేశ్ శర్మ జట్టు స్కోరును కాస్త నిలబెట్టే ప్రయత్నం చేశారు. లివింగ్‌స్టన్ 40 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 1 ఫోర్, 5 సిక్సులు ఉన్నాయి.జితేశ్ శర్మ 21 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 38 పరుగులు సాధించాడు.చివరి ఓవర్లలో టిమ్ డేవిడ్ ధాటిగా ఆడడంతో బెంగళూరుకు పోటీనిచ్చే స్కోరు సాధ్యమైంది. డేవిడ్ 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 32 పరుగులు చేశాడు.కృనాల్ పాండ్యా 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీయగా, సాయి కిశోర్ 2 వికెట్లు పడగొట్టాడు. అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీశారు.మ్యాచ్ ఇంకాస్త ఉత్కంఠగా మారే అవకాశం కనిపిస్తోంది.

Related Posts
షోయబ్ అక్తర్‌ ఇండియా పై ఘాటైన వ్యాఖ్యలు…
champions trophy 2025

పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీసుకున్న నిర్ణయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, భారత్‌లో ఐసీసీ ఈవెంట్లలో పాల్గొని గెలిచేందుకు Read more

విరాట్ కోహ్లీ క్రికెట్ పై సౌతాఫ్రికా జోస్యం
విరాట్ కోహ్లీ క్రికెట్ పై సౌతాఫ్రికా జోస్యం

టీమిండియా మాజీ సారథి, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రికెట్‌లో మరో మూడు నాలుగు సంవత్సరాలు కొనసాగుతాడని, సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును బద్దలుగొట్టే అవకాశం Read more

గాయం నుంచి కోలుకుంటున్న బుమ్రా
[:en]గాయం నుంచి కోలుకుంటున్న బుమ్రా[:]

టీమిండియా ప్రముఖ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో గాయం పడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడి గాయం స్థితి పై అనిశ్చితి కొనసాగుతుంది. ఇంగ్లండ్ Read more

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా

రాజ్‌కోట్‌లో మూడో టీ20 మ్యాచ్ కోసం టీమిండియా సిద్ధంగా ఉంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా హ్యాట్రిక్ విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. అర్షదీప్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×