VIP break darshans canceled in Tirumala tomorrow.. !

రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు.. !

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు ఓ ముఖ్య విషయాన్ని తెలియజేశారు. మంగళవారం శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించబోతున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. జనవరి 10 నుంచి 19 వరకూ పదిరోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు అధికారులు ఎప్పుడో ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisements

ఈ నేపథ్యంలో ద్వార దర్శనాలను పురస్కరించుకుని జనవరి ఏడో తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్బంగా జనవరి ఏడో తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆరో తేదీన సిఫార్సు లేఖలను స్వీకరించడం లేదని ఓ ప్రకటనలో చెప్పింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది.

మరోవైపు తిరుమల శ్రీవారి ఆలయంలో ఏడాదికి నాలుగుసార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం, ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాల సమయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేస్తారు. ఆయా పర్వదినాలకు ముందు వచ్చే మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని టీటీడీ ఆగమోక్తంగా చేపడుతుంది.

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా మంగళవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అర్చకులు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనంద నిలయం నుంచి బంగారు వాకిలి వరకు శుభ్రం చేస్తారు. ఇక ఆలయాన్ని శుద్ధి చేసే సమయంలో శ్రీవారి మూల విరాట్టును వస్త్రంతో పూర్తిగా మూసివేస్తారు. ఆ తరువాత ఆలయ శుద్ధి అనంతరం సుగంధ ద్రవ్యాలు కలిపిన పరిమల జలంతో ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు.

Related Posts
మందుప్రియులకు కొత్త సంవత్సరం కానుక
wine shop

మందుప్రియులకు ఏపీ కూటమి సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త ఎక్సైజ్ విధానం తీసుకువచ్చాక ప్రైవేటుకు మద్యం షాపులు అప్పగించినా ఎమ్మార్పీ రేట్ల కంటే ఎక్కువగా Read more

Vaishnavi Gowda : ప్రియుడితో ప్రముఖ నటి నిశ్చితార్థం
actress vaishnavi gowda eng

కన్నడ బుల్లితెర పై తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి వైష్ణవి గౌడ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో అడుగుపెట్టబోతుంది. ఆమె తన ప్రియుడు, ఇండియన్ Read more

బెయిల్ ను తిరస్కరించి జైలుకు వెళ్ళిన ప్రశాంత్ కిషోర్
బెయిల్ ను తిరస్కరించి జైలుకు వెళ్ళిన ప్రశాంత్ కిషోర్

జాన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సోమవారం మాట్లాడారు. తాను ఎటువంటి నేర కార్యకలాపాల్లో పాల్గొనలేదని, అయితే బెయిల్ ఉత్తర్వులపై సంతకం చేయాలని వచ్చినప్పుడు నిరాకరించానని Read more

CM Chandrababu : పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మృతి పై విచారణకు సీఎం ఆదేశం
పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మృతి పై విచారణకు సీఎం ఆదేశం

CM Chandrababu: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నవిషయం తెలిసిందే. అయితే ప్రవీణ్ పగడాల మృతిపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు విచారం Read more

×