Vinil Pulivarthi ఎమ్మెల్యే పులివర్తి నాని కి వెరైటీగా బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పిన ఫ్రెండ్స్

Vinil Pulivarthi : ఎమ్మెల్యే పులివర్తి నాని కి వెరైటీగా బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పిన ఫ్రెండ్స్

టీడీపీ నేత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానీ తనయుడు వినీల్ పుట్టినరోజు వేడుకలు ఈసారి ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరిగాయి. ప్రత్యేకత ఏమిటంటే, ఈ వేడుకలు ఎక్కడో తెలంగాణలో, ఆంధ్రాలో కాదు.ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ నగరంలో జరిగాయి.అయితే అక్కడ ఫ్రెండ్స్ వేసిన ప్లాన్‌కి ఇప్పుడు సోషల్ మీడియాలో పాజిటివ్ గాలే వీస్తోంది! వినీల్ స్నేహితులు, ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు కలసి ఓ అద్భుతమైన ఆశ్చర్యాన్ని ప్లాన్ చేశారు. గోల్డ్ కోస్ట్ గగనతలంలో ఓ విమానాన్ని ఎగురవేశారు.ఆ విమానానికి ఒక భారీ బ్యానర్‌ను జత చేశారు.

Advertisements

అందులో “Happy Birthday Pulivarthi Vineel” అనే శుభాకాంక్షలు ఉండటం విశేషం.ఆ బ్యానర్ గాల్లో అలరించగా, చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నిమగ్నమయ్యారు.ఇలా ఓ వ్యక్తి పుట్టినరోజు కోసం విమానం వినూత్నంగా వినియోగించడం గొప్పగా మారింది. ఈ అద్భుత దృశ్యాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.పుట్టినరోజుని అంతగా ప్రత్యేకంగా మార్చిన ఈ గిఫ్ట్ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. వినీల్‌కు విషెస్ చెప్పేందుకు పార్టీ సీనియర్‌లు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు.పులివర్తి నాని, తన కుమారుడి పట్ల ఉన్న ప్రేమను ఈ పోస్ట్‌లో బాగా వ్యక్తపరిచారు. “నన్ను గర్వపడేలా చేసే నా కొడుకుకు జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ఆయన ఎమోషనల్ మెసేజ్ షేర్ చేశారు.ఇలాంటి వినూత్న పుట్టినరోజు వేడుకలు సాధారణంగా అందరికి ఉండవు. కానీ పులివర్తి వినీల్‌కు మాత్రం ఇది గుర్తుండిపోయే కానుకగా నిలిచింది. విమానం మీద బర్త్ డే విషెస్… అది కూడా విదేశాల్లో… ఇంకేముంటుంది భయ్యా! స్టైల్ అంటే ఇదే అంటున్నారు నెటిజన్లు.

READ MORE : Prabhas: జాట్ మూవీ టీమ్‌ని కలిసిన ప్రభాస్

Related Posts
ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయండి: రాజ్‌నాథ్ సింగ్‌కు లోకేశ్ విజ్ఞప్తి
Set up defense cluster in AP.. Lokesh appeals to Rajnath Singh

న్యూఢిల్లీ: రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఢిల్లీలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటనలో భాగంగా నారా లోకేశ్ ఈనెల Read more

Bank holidays: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏప్రిల్‌ నెల బ్యాంకు సెలవు ఇలా..
Bank holidays for the month of April for Telugu states

Bank holidays : ఏప్రిల్‌ నెలలో చాలా రోజులు బ్యాంకులకు సెలవులు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా శని, ఆదివారాలతో కలిపి దాదాపు 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు Read more

తిరుపతిలో వరుస బాంబ్ బెదిరింపులు
Serial bomb threats in Tiru

ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపుల కేసులు పెరుగుతున్నాయి. విమానాలు, పలు ప్రముఖ ప్రదేశాలు, హోటళ్లకు తరచుగా బెదిరింపు కాల్స్, ఈమెయిల్స్ వస్తుండడం ప్రజల్లో ఆందోళనకు దారి Read more

Chandrababu : నేడు బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబు
టిడిపిని లేకుండా చేయాలనుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. చినగంజాం మండలంలోని కొత్తగొల్లపాలెంలో ఆయన లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×