భారత ప్రఖ్యాత రెజ్లర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినేశ్ ఫోగాట్‌కు హర్యానా బీజేపీ ప్రభుత్వం భారీ నగదు బహుమతిని ప్రకటించింది. ఆమెకు రూ.4 కోట్ల నగదు బహుమతిని ఇవ్వనున్నట్లు అధికారికంగా తెలిపింది. గత ఏడాది ఒలింపిక్స్‌లో వినేశ్ 50 కిలోల విభాగంలో పోటీ చేసి ఫైనల్‌కి చేరింది. కానీ, అధిక బరువుతో పాల్గొనడం వల్ల డిస్ క్వాలిఫై అయ్యారు. తక్కువ తేడాతో మెడల్ మిస్ కావడం అభిమానులను నిరాశపరిచింది.పతకాలు గెలిచిన అథ్లెట్లకు ఇచ్చే గౌరవాన్నే వినేశ్‌కి ఇవ్వాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆమెకు ముగ్గురు ఎంపికల అవకాశాలను ఇచ్చారు – విలాసవంతమైన ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం లేదా నగదు బహుమతి. వినేశ్ ఆలోచించకుండా నగదు బహుమతినే ఎంచుకుంది. అందుకే ఆమెకు నేరుగా రూ.4 కోట్ల నగదు బహుమతి అందించనున్నట్టు వెల్లడించారు.

అవార్డులకంటే ప్రజల మద్దతే గొప్పది
వినేశ్ ఇప్పటికే రాజకీయాల్లో కూడా సత్తా చాటారు. గత ఏడాది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. రెజ్లింగ్‌లో పట్టు ఉన్న ఆమె, ఇప్పుడు ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.వినేశ్ ఫోగాట్ వ్యక్తిగత జీవితం కూడా ఎంతో స్టైలిష్‌గా సాగుతోంది. ఆమెకు ప్రముఖ రెజ్లర్ సోమ్‌వీర్ రాఠీతో వివాహమైంది. ప్రస్తుతం వినేశ్‌కి రూ.40 కోట్ల సమీపంలో నికర ఆస్తులున్నట్లు సమాచారం. ఖార్ఖోడాలో రూ.2 కోట్ల విలువైన లగ్జరీ విల్లా ఆమెకు ఉంది. అంతేకాదు, రూ.1.8 కోట్ల విలువైన మెర్సిడెస్ GLE, వోల్వో XC60 వంటి ప్రీమియం కార్లు కూడా వినేశ్ వాడుతున్నట్టు తెలుస్తోంది.
ఒక స్పోర్ట్స్‌వుమన్‌గా, నాయకురాలిగా ఆదర్శంగా
క్రీడా రంగంలోనే కాదు, సమాజానికి సేవ చేయాలనే తపనతో వినేశ్ ముందుకెళ్తున్నారు. ఆమె విజయం కేవలం పోటీల పరిమితిలో కాదు – ప్రజల గుండెల్లో స్థానం సంపాదించడమే ఆమె నిజమైన గె లుపు.