villagers rushed the pregnant woman to the hospital in Doli

డోలి లో గర్భిణీని ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు..

విశాఖ : స్వాతంత్రం సిద్ధించి 77 సంవత్సరాలు గడుస్తున్నా, ప్రపంచం ఆధునిక పోకడలకు అనుసరిస్తున్నా విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల కష్టాలు మాత్రం తీరడం లేదు. ఇప్పటికి కూడా వారికి సరైన వైద్యం అందుబాటులో ఉండడం లేదు. ఇక గర్భిణీల పరిస్థితి వర్ణణాతీతంగా ఉంటుంది. నొప్పులు ప్రారంభించిన వెంటనే కొన్ని గంటల పాటు గర్భిణీ మహిళను డోలిలో కట్టుకొని కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తరలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మార్గమధ్యంలోనే ప్రసవమైన ఘటనలు ఉన్నాయి. మరికొన్ని సందర్భాల్లో తల్లి బిడ్డ కూడా మృతి చెందడం జరిగింది. తాజాగా మంగళవారం నాడు దేవరపల్లి మండలం బోడిగరువు గ్రామంలో పురుటి నొప్పులతో బాధపడుతున్న సాహూ శ్రావణి అనే గర్భిణీ ని డోలి కట్టి చిత్తడి కాలిబాటను, పొంగిపొర్లుతున్న వాగును దాటించి ఆసుపత్రికి తీసుకెళ్లిన గిరిజనులు. ఈ డోలి కష్టాలు తొలగించి తమ గ్రామానికి రోడ్డు వేయాలని గిరిజనులు వేడుకుంటున్నారు.

Related Posts
సైనికుల పిల్లలకు యాభై శాతం స్కాలర్ షిప్ -మంచు విష్ణు
manchuvishnu

టాలీవుడ్ నటుడు మంచు విష్ణు రిపబ్లిక్ డే సందర్భంగా సైనికుల కుటుంబాలకు అండగా నిలిచే మంచి పనికి శ్రీకారం చుట్టాడు. దేశానికి సేవ చేస్తున్న సైనికుల పిల్లల Read more

ఇండస్ట్రీలో సీనియర్ నటుడు మృతి
ఇండస్ట్రీలో సీనియర్ నటుడు మృతి

టాలీవుడ్‌లో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. సీనియర్ నటుడు విజయ రంగరాజు మరణ వార్త సినీ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని ప్రభుత్వ Read more

మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసిన నారా లోకేష్
lokesh mahakunbhamela

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా కు హాజరయ్యారు. హిందూ సంప్రదాయ ప్రకారం పవిత్ర కుంభమేళా లో పాల్గొనడం విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ Read more

నారాలోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లపై టీడీపీ ఎమ్మెల్యే ఆసక్తిక వ్యాఖ్యలు
pavan and lokesh

చలికాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడికి పుట్టిస్తున్నాయి. మంత్రి నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కూటమిలో రాజకీయం Read more