విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థలు సమర్థవంతంగా పనిచేసేలా బలోపేతం చేయడానికి, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర శాఖల నుండి అధికారులను మున్సిపల్ కమిషనర్లు/అదనపు కమిషనర్లుగా డిప్యుటే షన్పై నియమించడానికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసిందని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ తెలిపారు. పట్టణ రంగంలో వేగంగా మారుతున్న సవాళ్లకు ప్రతిస్పందనగా, సమర్థవంతమైన, వృత్తిపరమైన జవాబుదారీ పట్టణ పాలనను ప్రోత్సహించడానికి ప్రభుత్వ విస్తృత ప్రయత్నాలలో ఇది ఒక భాగం అని సురేష్ కుమార్ స్పష్టంచేశారు. పౌరులకు పారిశుధ్యం, నీటిసరఫరా, వ్యర్థాల నిర్వ హణ, వీధి దీపాలు, పట్టణ మోలిక సదుపాయాలు వంటి అవసరమైన పౌర సేవలను అందించడంలో పట్టణ స్థానిక సంస్థలు ప్రాథమిక పాత్ర పోషిస్తాయి.
సమగ్ర మార్గదర్శకాలు జారీ
గత కొన్నేళ్లుగా, పరిపాలనా అవసరాలు, మానవ వనరుల కొరత కారణంగా, ఇతర శాఖల నుండి అధికారులను మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి విభాగానికి డిప్యుటేషన్పై పంపడం జరిగింది. అయితే, ఈవిధంగా డిప్యుటేషన్పై వచ్చిన అధికారులలో డొమైన్ నైపుణ్యం లేకపోవడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి, ఇది పలు మున్సిపాలిటీలలో పాలన నాణ్యతను ప్రభావితం చేసింది. ఇటీవల, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కమిషనర్స్ అసోసియేషన్ (Andhra Pradesh Municipal Commissioners Association) ఈ డిప్యుటేషన్ల వల్ల తలెత్తుతున్న అసమర్థతలను ఎత్తిచూపి, కఠినమైన అర్హత ప్రమాణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. మున్సిపల్ పరిపాలన. పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పి. నారాయణ ఆదేశాల మేరకు, కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పట్టణ పాలన యొక్క సంక్లిష్టత స్థాయిలో సమర్థవంతమైన నాయకత్వం యొక్క ఆవశ్యకతను నొక్కిచెబుతూ ఒక వివరణాత్మక ప్రతిపాదనను సమర్పించారు.
పట్టణ పాలన సమస్యలపై ప్రాథమిక పరిజ్ఞానం
కొత్త మార్గదర్శకాలలోని ముఖ్య అంశాలను గమనిస్తే కొత్త ఉత్తర్వు ప్రకారం, సరైన అర్హతలు, అనుభవం, సామర్థ్యం ఉన్న అధికారులను మాత్రమే పరిగణనలోకి తీసుకునేలా డిప్యుటేషన్లను నియంత్రించడానికి, క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం ప్రామాణిక యంత్రాంగాన్ని ప్రవేశపెట్టింది.
అర్హత ఉన్న విభాగాలకు పోస్టులుకు పట్టణ పాలన సమస్యలపై ప్రాథమిక పరిజ్ఞానం ఉన్న సంబంధిత మున్సిపల్ సంస్థ గ్రేడ్కు (Municipal Corporation Grade) అనుగుణంగా జీతభత్యాలు పొందే అధికారులు మాత్రమే అర్హులు. డిప్యుటేషన్కు అర్హత ఉన్న విభాగాలు. స్థానాలు గమనిస్తే పంచాయతీ రాజ్ శాఖ: ఎంపీడీవో.ఎంఎల్డీవో, డిప్యూటీ సీఈవో, జిల్లా పరిషత్ల సిఇఒ (వివిధ గ్రేడ్ల మున్సిపాలిటీల కోసం). రెవెన్యూ శాఖ: తహసీల్దార్లు డిప్యూటీ కలెక్టర్లు. స్టేట్ ఆడిట్ శాఖ: అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు జిల్లా ఆడిట్ ఆఫీసర్లు. సచివాలయ శాఖ: సెక్షన్ ఆఫీసర్లు మరియు అసిస్టెంట్ సెక్రటరీలు.

అర్హతగల అభ్యర్థులు
మున్సిపల్ కమిషనర్ / అదనపు కమిషనర్ (గ్రేడ్ నుండి సెలక్షన్ గ్రేడ్) పోస్టుకు అనుగుణంగా జీతభత్యాలు ఉన్న అధికారులను మాత్రమే పరిగణనలోకి తీసు కుంటారు. అది కూడా కేవలం పరిపాలనా అవసరాల సమయంలో, శాఖలో అర్హతగల అభ్యర్థులు అందుబాటులో లేనప్పుడు మాత్రమే డిప్యుటేషన్ అనుమతించబడుతుంది. పాలనా ప్రమాణాలను పెంపొందించడానికి, డిప్యుటేషన్ ప్రక్రియకు ఈ క్రింది ముందస్తు అర్హతలు తప్పనిసరి ప్రస్తుత శాఖలో కనీసం ఐదు సంవత్సరాల సేవ, ప్రొబేషన్ పూర్తి చేసి ఉండాలి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. తిశిశిళీది నిర్వహించిన అకౌంట్స్ టెస్ట్ ఫర్ లోకల్ బాడీస్ పార్ట్,, ॥ విజయవంతంగా పూర్తి చేసి ఉండాలి. విజిలెన్స్ అధికారుల నుండి క్లియరెన్స్ మరియు ప్రస్తుత శాఖ నుండి సమ్మతి పొందాలి.
వినూత్న కార్యక్రమం
తప్పనిసరి శిక్షణ కార్యక్రమం: ఇది ఒక వినూత్న కార్యక్రమం. డిప్యుటేషన్ ప్రాతిపదికన పోస్టింగ్ ఇచ్చిన తర్వాత విధుల్లో చేరడానికి ముందు అన్ని అధికారుల కోసం 30 రోజుల నిర్మాణాత్మక శిక్షణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ శిక్షణలో భాగంగా, కింది సంస్థలు/విభాగాలలో అవగాహన కార్యక్రమాలు ఉంటాయి: కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సి పల్ అడ్మినిస్ట్రేషన్, కార్యాలయం డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (Directorate of Town and Country Planning). ఇంజనీర్న్చీఫ్ (పబ్లిక్ హెల్త్). ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2 రోజులు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ బిల్డింగ్ కార్పొరేషన్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ . మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ పట్టణ స్థానిక సంస్థలలో ఆచరణాత్మక శిక్షణ ఉంటుంది.
విజయవాడ జిల్లా కొత్త పేరు ఏమిటి?
విజయవాడ జిల్లా కొత్త పేరు ఎన్టీఆర్ జిల్లా (NTR District).
విజయవాడ జిల్లాను ఎన్టీఆర్ జిల్లా గా ఎందుకు పేరు మార్చారు?
ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సినీ రంగాల్లో విశిష్ట పాత్ర పోషించిన నందమూరి తారకరామారావు (NTR) గారికి గౌరవం గా ఈ పేరును ప్రభుత్వం పెట్టింది.
Read hindi news:
Read Also: Chandrababu: అమరావతిలో బ్యాడ్మింటన్ శిక్షణ కేంద్రానికి సాయం చేయండి: చంద్రబాబు