హైదరాబాద్‌లో ఇటీవల ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో, లేడీ అమితాబ్ విజయశాంతి కీలక పాత్ర పోషించారు. సాయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా అలరించనుండగా, దర్శకత్వ బాధ్యతలు ప్రదీప్ చిలుకూరి చేపట్టారు. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ వేడుకలో విజయశాంతి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. “సీనియర్ ఎన్టీఆర్ అంటే నాకు ఎంతో గౌరవం. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. అదే స్ఫూర్తితో పని చేస్తుంటాను,” అని చెప్పిన ఆమె, జూనియర్ ఎన్టీఆర్‌ని కూడా కొనియాడారు. “తారక్ ఎంత కష్టపడతారో అందరికీ తెలుసు. నటనలో ఆయన అద్భుతం,” అని పేర్కొన్నారు.

కళ్యాణ్ రామ్‌పై ప్రత్యేకమైన అభిమానం
కళ్యాణ్ రామ్‌తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని విజయశాంతి చెప్పారు. “ఇద్దరం రామ-లక్ష్మణుల్లా కలిసి నటించాం. ఆయన ఎంతో సహకరించారు,” అని చెప్పారు. “ప్రేక్షకులు వీరిద్దరిని ఎంతో ప్రేమతో గుండెల్లో పెట్టుకున్నారు. అన్నదమ్ములు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను,” అని వ్యాఖ్యానించారు.
తల్లిని ప్రతిబింబించే చిత్రం
“అర్జున్ సన్నాఫ్ వైజయంతి” అనే సినిమా ప్రతి తల్లికి అంకితమని విజయశాంతి స్పష్టం చేశారు. “ఫ్యాన్స్ కోరిక మేరకు నేను ఈ సినిమా చేశాను. దర్శకుడు చెప్పిన కథ నచ్చింది. కొన్ని సూచనలు కూడా చేశాను. ఇక హిట్ కాకుండా ఉంటుందా?” అని ఆత్మవిశ్వాసంగా చెప్పారు. ఎడిటర్ తమ్మిరాజు, సెన్సార్ సభ్యుల ప్రశంసలు మరింత నమ్మకం కలిగించాయని వెల్లడించారు.ఈ చిత్రం తల్లి ప్రేమ, కొడుకు మార్గభ్రంశం, వారి మధ్య భావోద్వేగ పోరాటం చుట్టూ తిరుగుతుంది. “తల్లి తన బిడ్డను సన్మార్గంలో నడిపించాలనే తపనతో ఎలా పోరాడుతుందో ఈ సినిమాలో చూడొచ్చు,” అని చెప్పారు. ఇది పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని, క్లైమాక్స్ కూడా అద్భుతంగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Read Also : Sonu Sood : నా భార్య ప్రాణాలతో ఉందంటే కారణం అదే : సోనూసూద్