Vijayasai Reddy quits polit

రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రాజీనామా..

వైసీపీ సీనియర్ నేత, జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన విజయసాయిరెడ్డి.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. ఈ మేరకు అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసారు.

Advertisements

రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.

రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను.

ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు.

ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు.

నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వై యస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను.

రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని.

జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా.

పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా.

దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు

టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది.

నా భవిష్యత్తు వ్యవసాయం.

సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేసాడు.

Related Posts
వైసీపీపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు
వైసీపీపై షర్మిల ఘాటు వ్యాఖ్యలు

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. ముఖ్యంగా, ప్రస్తుత కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారాన్ని చేస్తూ, అసెంబ్లీ వేదికగా ప్రజలను మభ్యపెట్టే Read more

గుకేశ్ గెలిచిన క్షణం.. తండ్రి భావోద్వేగం
gukesh dommaraju won world

భారత చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ అతి చిన్న వయసులో వరల్డ్ చెస్ ఛాంపియన్ (18)గా అవతరించిన సంగతి తెలిసిందే. కొడుకు విజయం కోసం పరితపించిన అతడి Read more

Telangana Budget: తెలంగాణ బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం
Cabinet approves Telangana budget

Telangana Budget: తెలంగాణ 2025-26 వార్షిక బడ్జెట్‌ కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగిన కేబినెట్ సమావేశం కాసేపటి క్రితం ముగిసింది. ఈ మేరకు Read more

భర్తకు అవయవదానం చేసి గొప్ప ఇల్లాలు అనిపించుకుంది
wife lavanya donates part o

ఈ ప్రపంచంలో భార్య, భర్తల బంధానికి ఎంతో ప్రత్యేకత ఉంది. భార్య భర్తల బంధం అనేది ఒక పవిత్రమైన సంబంధం, ఇది విశ్వాసం, ప్రేమ, పరస్పర గౌరవం, Read more