విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన కింగ్‌డమ్ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. ఈయన గతంలో జెర్సీ అనే బ్లాక్‌బస్టర్ సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమాకు జాతీయ పురస్కారం కూడా వచ్చింది. కింగ్‌డమ్ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. నటుడు సత్యదేవ్ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.
అన్నదమ్ముల మధ్య సెంటిమెంట్
ఇది కేవలం స్పై యాక్షన్ థ్రిల్లర్ మాత్రమే కాదు, అన్నదమ్ముల మధ్య సెంటిమెంట్‌ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రేపు ఈ మూవీ (kingdom) ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర హీరో, హీరోయిన్ తో పాటు నిర్మాత నాగవంశీ లు పవన్ కళ్యాణ్ ను కలిసి ఆయన బ్లేసింగ్స్ తీసుకున్నారు. ఈ విషయాన్నీ విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ ను కలవడం ఎంతో సంతోషంగా ఉందంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.
పవన్ కళ్యాణ్ ను కలవడం ఎంతో సంతోషం
దర్శకుడు హరీష్ శంకర్ రూపొందిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా సెట్లో పవన్ కల్యాణ్(Pawan )ను విజయ్ దేవరకొండ, నటి భాగ్యశ్రీ బోర్సే, నిర్మాత నాగ వంశీ కలిసి కలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చిత్రం విజయం సాధించాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల ‘హరిహర వీరమల్లు’ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించిన పవన్.. ప్రస్తుతం ‘ఓజీ’ మరియు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాల కోసం శరవేగంగా పని చేస్తున్నారు.
Read Also : Telangana Govt : ఫీల్డ్ అసిస్టెంట్లకు (FA) తెలంగాణ ప్రభుత్వం శుభవార్త